'నిధి అగ‌ర్వాల్‌' ఇంటర్వ్యూ

Friday,July 19,2019 - 05:38 by Z_CLU

‘ఇస్మార్ట్ శంకర్’ లో న్యూరో సైంటిస్ట్ గా తన గ్లామరస్ యాక్టింగ్ తో ఎట్రాక్ట్ చేసింది నిధి అగర్వాల్. నిన్న విడుదలైన ఈ సినిమా పాజిటీవ్ టాక్ తో మంచి వసూళ్లు సాదిస్తుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించింది నిధి అగర్వాల్. ఆ విశేషాలు నిధి మాటల్లోనే…

 

 

ఫస్ట్ మెసేజ్ అదే

నిన్న రిలీజ్ రోజు పొద్దున్నే నేను విజయవాడలో ఉండగా నా ఫస్ట్ డైరెక్టర్ చందూ మొండేటి సార్ నుండి మెసేజ్ వచ్చింది. “కంగ్రాట్స్ ఫర్ యువర్ ఫస్ట్ బ్లాక్ బస్టర్’ అని పంపారు. అది చూడగానే చాలా హ్యాపీ గా ఫీలయ్యాను. పట్టరాని ఆనందం వచ్చింది. ఆ తర్వాత కంటిన్యూగా మెసేజెస్ , కాల్స్ వచ్చాయి.

ఇంకా చూడలేదు

ఇంకా కంప్లీట్ సినిమా చూడలేదు. ఎప్పుడెప్పుడు చూద్దామా..? అని ఉంది. ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీగా ఉండడం వల్ల కుదరడం లేదు. కొంచెం టైం దొరకగానే చూసి ఎంజాయ్ చేస్తాను.


మాస్ పవర్ తెలుసుకున్నా…

నేను చేసిన రెండు సినిమాలు వేరు ఈ సినిమా వేరు. ఇస్మార్ట్ శంకర్ నాకు మాస్ పవర్ తెలియజేసింది. థియేటర్స్ కవరేజ్ కి వెళ్ళినప్పుడు మాస్ ఆడియన్స్ సినిమాను ఎంజాయ్ చేసే విధానం చూసి షాక్ అయ్యాను. సో మునుముందు మరిన్ని మాస్ సినిమాలు చేయాలనుంది.

నేను లక్కీ

పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో ఈ సినిమా చేసినందుకు లక్కీ గా ఫీలవుతున్నాను. ఆయన డైరెక్ట్ చేసిన ‘పోకిరి’ సినిమా చాలా సార్లు చూసాను. తెలుగులో నాకు బాగా నచ్చిన సినిమా అది. నిజానికి ఆయన సినిమా అనగానే అస్సలు వదులు కోకూడదని ఫీలయ్యాను. అందుకే అడిగిన వెంటనే ఒప్పేసుకున్నాను.

బెస్ట్ పర్సన్

పూరి గారు ఈస్ ది బెస్ట్ పర్సన్ ఇన్ ఇండస్ట్రీ. ఆయన యాక్టర్స్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ , రెస్పెక్ట్ వేరే లెవెల్ లో ఉంటుంది. అందుకే యాక్టర్స్ ఆయనకీ బాగా దగ్గరవుతారు. సెట్స్ లో ఆయన నాకు చాలా హెల్ప్ చేసారు. ఆయనతో మళ్ళీ వర్క్ చేయాలనుంది.

సూపర్బ్ ఎక్స్ పీరియన్స్

రామ్ తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ సూపర్. నైస్ పర్సన్. షూట్ లో తన పెర్ఫార్మెన్స్ చూసి చాలా నేర్చుకున్నాను. నిజానికి అందరూ మంచి మనుషులతో కలిసి పనిచేసాననే ఫీలింగ్ కలిగింది.

బెస్ట్ సపోర్టింగ్ సిస్టమ్

ఛార్మీ అడ్మినిస్ట్రేటివ్ గా సూపర్బ్… ఒక రకంగా చెప్పాలంటే అథారిటీ పొజిషన్స్ కి చాలా బాగా సూటవుతుంది. ఈ రోజు ఈ పని జరిగిపోవాలంటే.. ఎలాగైనా చేయించేస్తుంది. ఇస్మార్ట్ శంకర్ కి ఛార్మీ బెస్ట్ సపోర్టింగ్ సిస్టమ్.

 

లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్

రామ్ గోపాల్ వర్మ గారి ‘రంగీల’ సినిమా నాకు చాలా ఇష్టం. ఆయన నా గురించి స్పెషల్ గా ట్వీట్ చేయడం కిక్కునిచ్చింది. లాట్స్ అఫ్ రెస్పెక్ట్ ఫర్ హిం.

 

రొమాంటిక్ సినిమాలే

ఎక్కువగా రొమాంటిక్ సినిమాలే నచ్చుతాయి. ఆ జోనర్ సినిమాలే చూడటానికి ఇష్టపడతాను. అందుకే యాక్టర్ గా ఎక్కువగా రొమాంటిక్ సినిమాలే చేయాలనుకుంటున్నాను.

డబ్బింగ్ చెప్తా.. కానీ

ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నా. తెలుగులో డబ్బింగ్ చెప్పాలనుంది. కచ్చితంగా నా నెక్స్ట్ రొమాంటిక్ సినిమాకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటాను. రొమాంటిక్ సినిమాకే చెప్పడానికి నాకంటూ కొన్ని రీజన్స్ ఉన్నాయి.

అవి పట్టించుకోను

సోషల్ మీడియాలో ఆడియన్స్ కామెంట్స్ , కాంప్లిమెంట్స్ బాగా ఎంజాయ్ చేస్తాను. కొన్ని నెగిటీవ్ కామెంట్స్ ఉన్నా వాటిని పెద్దగా పట్టించుకోను. సోషల్ మీడియాలో అరవై శాతం పాజిటీవ్ ఉంటే మిగతాది నెగిటీవ్ ఉంటుంది. సో అవి పట్టించుకుంటే బాధ పడాల్సి వస్తుంది.

నెక్స్ట్ అదొక్కటే

తమిళ్ లో జయంravi 25 వ సినిమాలో నటిస్తున్నాను. ప్రస్తుతం అదొక్కటే చేస్తున్నాను. ఇస్మార్ట్ శంకర్ తో తెలుగులో కూడా మరిన్ని ఆఫర్స్ వస్తాయని అనుకుంటున్నా. తెలుగు ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్నాను.