కొత్త సినిమాలు - సరికొత్త టైటిల్స్

Thursday,August 23,2018 - 11:42 by Z_CLU

టైటిల్ తోనే ఫస్ట్ హైప్ క్రియేట్ అవుతుంది. అందుకే మూవీ టైటిల్స్ పై ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ఈ నెలలో కూడా కొన్ని కొత్త టైటిల్స్ రిజిస్టర్ అయ్యాయి. మరీ ముఖ్యంగా నాగచైతన్య-సమంత కొత్త సినిమాకు మొన్నటివరకు ప్రేయసి అనే టైటిల్ అనుకున్నారు. కానీ ఇప్పుడు మజిలీ అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు. ఇక అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై మన్మధుడు-2 అనే టైటిల్ రిజిస్టర్ చేయించాడు నాగ్

అటు రానాను హీరోగా పెట్టి తీయబోయే సినిమా కోసం హిరణ్య, హిరణ్యకశిప అనే 2 టైటిల్స్ రిజిస్టర్ చేయించాడు సురేష్ బాబు. వీటితో పాటు దిల్ రాజు బ్యానర్ పై పలుకే బంగారమాయె, మహర్షి టైటిల్స్ రిజిస్టర్ కాగా.. హీరో అనే టైటిల్ ను మైత్రీ మూవీ మేకర్స్ ఫిక్స్ చేసింది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ – పలుకే బంగారమాయె, మహర్షి
షైన్ స్క్రీన్ – మజిలీ
అన్నపూర్ణ స్టుడియోస్ – మన్మధుడు-2
మైత్రీ మూవీ మేకర్స్ – హీరో
సురేష్ ప్రొడక్షన్స్ – హిరణ్య, హిరణ్యకశిప
సీకే ఎంటర్ టైన్ మెంట్స్ – గృహిణి
శివానీ శివాత్మిక మూవీస్ – డా. రాజశేఖర్ కల్కి
నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ – ఆక్ పాక్ కరేపాక్