జీ సినిమాలు ( 23rd ఆగస్ట్)

Wednesday,August 22,2018 - 10:00 by Z_CLU

గణేష్

హీరోహీరోయిన్లు – రామ్,కాజల్
నటీనటులు – పూనమ్ కౌర్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం
సంగీతం – మిక్కీ జె మేయర్
దర్శకత్వం – శరవణన్
విడుదల తేదీ – 2009

రామ్ కాజల్ జంటగా తెరకెక్కిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘గణేష్ జస్ట్ గణేష్’. 2009 లో విడుదలైన ఈ సినిమా యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంది. మిక్కీ జె మేయర్ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలైట్. చిన్న పిల్లలతో గణేష్ చేసే హంగామా , కాజల్-రామ్ మధ్య వచ్చే లవ్ సీన్స్ బాగా అలరిస్తాయి. అబ్బూరి రవి అందించిన మాటలు సినిమాకు ప్లస్, ముఖ్యంగా క్లైమాక్స్ లో మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. కాజల్ కుటుంబ సభ్యుల మధ్య మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు అందరినీ హత్తుకుంటాయి.

_____________________________


గోరింటాకు

నటీ నటులు : రాజ శేఖర్, ఆర్తి అగర్వాల్ , మీరా జాస్మీన్
ఇతర నటీ నటులు : ఆకాష్, హేమ చౌదరి,సుజిత, శివ రాజా, మాస్టర్ నిధీశ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్.ఎ.రాజ్ కుమార్
డైరెక్టర్ : వి.ఆర్.ప్రతాప్
ప్రొడ్యూసర్ : ఎం.వి.ప్రసాద్, పారస్ జైన్
రిలీజ్ డేట్ : జులై 4 , 2008

అన్న-చెల్లెళ్ళ బంధం కధాంశం తో రాజ శేఖర్, ఆర్తి అగర్వాల్, మీరా జాస్మీన్ నటించిన ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమ లో ఎవర్ గ్రీన్ ఫామిలీ ఎంటర్టైనర్ గా నిలిచిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో రాజ శేఖర్-మీరా జాస్మీన్ ల మధ్య వచ్చే సన్నివేశాలు, అన్న-చెల్లెళ్ళ బంధం గురించి తెలియజేసే సీన్స్ సినిమాకు హైలైట్స్. ఎస్.ఎ.రాజ్ కుమార్ అందించిన పాటలు, ఆర్.ఆర్. సినిమాకు ప్లస్.

______________________________

దంగల్

నటీనటులు : ఆమీర్ ఖాన్, సాక్షి తన్వర్, ఫాతిమా సన షేక్, జైరా వసీం, సాన్య మల్హోత్రా తదితరులు

డైరెక్టర్ : ప్రీతమ్

డైరెక్టర్ : నితేష్ తివారి

ప్రొడ్యూసర్ : అమీర్ ఖాన్, కిరణ్ రావ్, సిద్ధార్థ్ రాయ్ కపూర్

రిలీజ్ డేట్ : డిసెంబర్ 21, 2016

తన లైఫ్ లో గోల్డ్ మెడల్ సాధించలేదని దిగులుగా ఉన్నా, తన కూతుళ్ళను ప్రపంచం గుర్తించే స్థాయిలో బాక్సింగ్ చాంపియన్ చేసే ఒక తండ్రి కథే దంగల్. కథ ప్రాధాన్యత ఉన్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందింది.

________________________________


బ్రదర్ అఫ్ బొమ్మాలి

నటీనటులు : అల్లరి నరేష్, కార్తీక, మోనాల్ గజ్జర్

ఇతర నటీనటులు : హర్ష వర్ధన్ రాణే, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : చిన్ని కృష్ణ

ప్రొడ్యూసర్ : అమ్మి రాజు కనిమిల్లి

రిలీజ్ డేట్ : నవంబర్ 7 , 2014

కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా , కార్తీక, మోనాల్ గజ్జర్ ఇతర పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘బ్రదర్ అఫ్ బొమ్మాలి’. ఈ సినిమా లో అల్లరిగా నరేష్ అక్కగా కార్తీక యాక్టింగ్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. కోన వెంకట్ గా బ్రహ్మానందం కామెడీ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. అల్లరి నరేష్ ఎనర్జీ తో కూడిన ఫన్నీ పెరఫార్మెన్స్, శేఖర్ చంద్ర మ్యూజిక్, కామెడీ సీన్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్.

___________________________________


ముకుంద

నటీనటులు : వరుణ్ తేజ్, పూజ హెగ్డే

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, రావు రమేష్, అభిమన్యు సింగ్, పరుచూరి వెంకటేశ్వర రావు, సత్యదేవ్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్: మిక్కీ. జె. మేయర్

డైరెక్టర్ : శ్రీకాంత్ అడ్డాల

ప్రొడ్యూసర్: ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్

రిలీజ్ డేట్ : 24 2014

మెగా హీరో వరుణ్ తేజ్ సిల్వర్ స్క్రీన్ పై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సూపర్ హిట్ సినిమా ముకుంద. ఒకే ఊళ్ళో రాజకీయ నేపథ్యంలో జరిగే కథతో తెరకెక్కిన ఈ సినిమాలో యూత్ కి , అటు ఫ్యామిలీకి సంబంధించిన ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

______________________________


మున్నా

నటీనటులు : ప్రభాస్, ఇలియానా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, రాహుల్ దేవ్, తనికెళ్ళ భరణి, వేణు మాధవ్, పోసాని కృష్ణ మురళి, వేణు తదితరులు…

మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్

డైరెక్టర్ : వంశీ పైడిపల్లి

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 2, మే 2007

ప్రభాస్, ఇలియానా జంటగా నటించిన పర్ ఫెక్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి పీటర్ హెయిన్స్ యాక్షన్, హారిస్ జయరాజ్ సంగీతం హైలెట్ గా నిలిచాయి.