నాగార్జున బర్త్ డే గిఫ్ట్ రెడీ

Thursday,August 23,2018 - 12:58 by Z_CLU

కింగ్ నాగార్జున బర్త్ డే గిఫ్ట్ రెడీ అయింది. ఈనెల 29న తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు నాగ్. ఆ రోజున దేవదాస్ మూవీ టీజర్ ను లాంచ్ చేయబోతున్నారు. ఈ మేరకు త్వరలోనే అఫీషియల్ స్టేట్ మెంట్ రానుంది.

ఈ సినిమాను సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజైంది. సినిమాను సెప్టెంబర్ 27న విడుదల చేస్తామని ఫస్ట్ లుక్ లోనే ప్రకటించారు. సో.. విడుదలకు సరిగ్గా నెల ముందు టీజర్ వస్తోందన్నమాట. ఈ గ్యాప్ లో ఆడియో రిలీజ్, ప్రీ-రిలీజ్ ఫంక్షన్లతో పాటు థియేట్రికల్ ట్రయిలర్ రిలీజ్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు.

వైజయంత్రీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో దేవ పాత్రలో నాగ్ కనిపించబోతున్నాడు. దాసు పాత్రలో నాని నటిస్తున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతోంది దేవదాస్. శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకుడు.