తెలుగు సినిమా కొత్త వారసులు

Thursday,May 16,2019 - 10:02 by Z_CLU

టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు కొత్త హీరోలు ఇంట్రడ్యూస్ అవుతూనే ఉంటారు. అయితే వీళ్ళు మాత్రం కొంచెం స్పెషల్. ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్న సీనియర్ యాక్టర్స్  వారసులు వీళ్ళు. ఇప్పుడిప్పుడే హీరోలుగా సక్సెస్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

విజయ్ రాజా : సీనియర్ నటుడు శివాజీ రాజా కొడుకు. ‘ఏదైనా జరగొచ్చు’ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా ఆడియో కూడా లాంచ్ అయింది. ‘స్టుపిడిటీ హ్యాజ్ నో బౌండరీస్’ అనే కొత్త థీమ్ తో తెరకెక్కుతుందీ సినిమా. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా, ఈ యంగ్ హీరోను ఏ స్థాయిలో ఎస్టాబ్లిష్ చేస్తుందో చూడాలి.

రాహుల్ విజయ్ : ‘ఈ మాయ పేరేమిటో’ సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యాడు రాహుల్ విజయ్. ఫైట్ మాస్టర్ విజయ్ కొడుకుగా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయిన ఈ హీరో, ఫస్ట్ సినిమాతో మంచి నటుడనిపించుకున్నాడు. రీసెంట్ గా ‘సూర్యకాంతం’ సినిమాలో కూడా పరవాలేదనిపించుకున్నాడు. ప్రస్తుతం ఇతడికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

శివ కందుకూరి : రీసెంట్ గా లాంచ్ అయింది ‘మనుచరిత్ర’ సినిమా. ఈ సినిమాతో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి కొడుకు శివ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఈ సినిమాని కాజల్ అగర్వాల్ సమర్పించడం విశేషం.

నవీన్ విజయ కృష్ణ : ‘నందిని నర్సింగ్ హోమ్’ సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యాడు. ప్రస్తుతం ‘ఊరంతా అనుకుంటున్నారు ‘ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమా సక్సెస్ కోసం ప్రస్తుతం నవీన్ వెయిటింగ్.