వైరల్ పిక్: మేకోవర్ నిజమేనా తారక్!

Saturday,October 05,2019 - 03:56 by Z_CLU

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘RRR’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఇద్దరూ హీరోలు తమ లుక్ ను మార్చుకున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఎన్టీఆర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో ఎన్టీఆర్ చాలా స్లిమ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ‘అరవింద సమేత’ లో స్లిమ్ గా కనిపించిన ఎన్టీఆర్ ‘RRR’ కోసం కొంచెం బరువు పెరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ పూర్తిగా స్లిమ్ లుక్ లో కనిపిస్తూ ఉండడంతో ఇది కొమరం భీమ్ పాత్రకు సంబంధించిన సెకెండ్ లుక్ అంటూ ప్రచారం జరుగుతోంది.

కానీ కొందరు మాత్రం ఇది పాత ఫోటోనే అని కొత్తగా సోషల్ మీడియాలో వైరల్ అయిందని చెబుతున్నారు. ఏ విషయం నిజమో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వేచి చూడకతప్పదు. ఈ పిక్ మాత్రం బాగానే వైరల్ అవుతోంది మరి.