NTR Birthday Special - బ్రాండ్ న్యూ పోస్టర్

Thursday,May 20,2021 - 01:25 by Z_CLU

NTR-Koratala Movie నుంచి అంతా ఊహించినట్టుగానే పోస్టర్ వచ్చేసింది. తారక రాముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఓ బ్రాండ్ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఒక్క ముక్కలో చెప్పాలంటే పోస్టర్ లుక్ సింపుల్ & స్వీట్ గా ఉంది.

ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్ ఎగ్రెసివ్ గా, యాక్షన్ మోడ్ లో ఉన్న స్టిల్ ను రిలీజ్ చేశారు. అదే టైమ్ లో కొరటాల శివ సినిమా నుంచి కూల్ లుక్ బయటకొచ్చింది. ఇలా ఒకే రోజు ఎన్టీఆర్ నుంచి రెండు డిఫరెంట్ షేడ్స్ ను ఎలివేట్ చేస్తూ రెండు పోస్టర్లు రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

ntr look from koratala movie zeecinemalu

కొరటాల శివ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్.. వింటేజ్ ఎన్టీఆర్ ను గుర్తుకు తెచ్చింది. ఇంకా చెప్పాలంటే బృందావనం సినిమాలో తారక్ ఎంత హ్యాండ్సమ్ గా, లవర్ బాయ్ గా కనిపించాడో.. దాదాపు ఆ వేరియేషన్స్ అన్నీ ఈ కొత్త లుక్ లోకి తీసుకొచ్చేశారు.

కొరటాల సినిమాల్లో హీరో చూడ్డానికి సాఫ్ట్ గానే కనిపిస్తాడు. తక్కువ మాట్లాడతాడు. ఆ సాఫ్ట్ నెస్, సైలెన్స్ మొత్తం ఈ కొత్త పోస్టర్ లో కనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అటు ఆర్ఆర్ఆర్ పోస్టర్, ఇటు కొరటాల శివ పోస్టర్లను పక్కపక్కనపెట్టి వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. తక్కువ టైమ్ లో ఇలా డిఫరెంట్ వేరియేషన్స్ ఇవ్వడం తారక్ కే సాధ్యం అంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.

ntr letter

మరోవైపు ఈ సెలబ్రేషన్స్ అన్నింటికీ ఎన్టీఆర్ దూరంగా ఉన్నాడు. కరోనాతో బాధపడుతున్న యంగ్ టైగర్, ప్రస్తుతం ఐసొలేషన్ లో ఉన్నాడు. తనకు కరోనా సోకిన విషయాన్ని ప్రకటించిన తారక్, తాజాగా అభిమానులకు ఓపెన్ లెటర్ రాశాడు. తన పుట్టినరోజు పేరిట ఎవ్వరూ బయటకురావొద్దని, సంబరాలు చేయొద్దని విజ్ఞప్తి చేశాడు. దీంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics