జీ సినిమాలు స్పెషల్: ఎన్టీఆర్ మేకోవర్

Wednesday,February 27,2019 - 07:31 by Z_CLU

కేవలం కథ, కథనం, క్యారెక్టర్ కొత్తగా ఉంటే సరిపోదు. అందులో తన గెటప్ కూడా కొత్తగా ఉండేలా కేర్ తీసుకుంటున్నాడు యంగ్ టైగర్. అందుకే టెంపర్ నుంచి మేకోవర్ పై స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. గడ్డం పెంచినా, సిక్స్ ప్యాక్ సాధించినా అన్నీ ఆ మేకోవర్ లో భాగమే.

టెంపర్ నుండి డిఫరెంట్ మేకోవర్ ట్రై చేస్తూ ప్రతీ సినిమాలో ఓ డిఫరెంట్ లుక్ తో ఎట్రాక్ట్ చేస్తున్నాడు ఎన్టీఆర్.. టెంపర్ లో సిక్స్ ప్యాక్ చేసి డిఫరెంట్ గడ్డంతో కొత్తగా కనిపించి ఎంటర్టైన్ చేసాడు. నిజానికి అప్పటివరకు ఎన్టీఆర్ ను ఎవరూ అలా ఊహించుకోలేదు. ఒక్కసారిగా సిక్స్ ప్యాక్ లో కనిపించేసరికి అంతా షాక్. యంగ్ టైగర్ అద్భుతంగా క్లిక్ అయ్యాడు. సూపర్ హిట్ కొట్టాడు.

ఇక ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ఎన్టీఆర్ లుక్ మామూలు హంగామా చేయలేదు. ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుండే ఎన్టీఆర్ గెటప్ హాట్ టాపిక్ అయింది. బియర్డ్ లుక్ తో , డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో, మోస్ట్ స్టైలిష్ గా మారిపోయాడు యంగ్ టైగర్. నిజానికి ఈ లుక్ ను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనే భయం యూనిట్ లో ఉండేది. కానీ సినిమాతో పాటు మేకోవర్ కూడా అదిరింది.

తర్వాత వచ్చిన ‘జనత గ్యారేజ్’ లో కాలేజీ కుర్రాడిగా క్లాస్ లుక్ తో మెప్పించాడు. ఈ సినిమాలో తారక్ లుక్ ఫాన్స్ తో పాటు అందర్నీ ఇంప్రెస్ చేసింది. చూడ్డానికి సింపుల్ గా ఉన్నప్పటికీ, ఎక్కడో ఏదో తెలియని రఫ్ & మాస్ లుక్ ఆ గెటప్ లో కనిపించింది.

ఇక ఎన్టీఆర్ మేకోవర్ లో పీక్స్ చూడాలంటే ‘జైలవకుశ’ చూడాల్సిందే. అందులో మూడు డిఫరెంట్ లుక్స్ తో ఆకట్టుకున్నాడు తారక్. ముఖ్యంగా జై క్యారెక్టర్ కోసం కంప్లీట్ గా లుక్ చేంజ్ చేశాడు. సినిమాలో తారక్ హెయిర్ స్టైల్ , మీసం తో పాటు డ్రెస్సింగ్ కూడా పూర్తిగా మారిపోయింది.


ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ తో కలిసి సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా కోసం ఇప్పటికే మేకోవర్ అయ్యే పనిలో పడ్డాడు ఎన్టీఆర్. దట్టంగా గడ్డం పెంచడంతో పాటు కాస్త లావెక్కినట్టు కనిపిస్తున్నాడు. హెయిర్ స్టయిల్ ను కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకూ ఎవరూ చూడని మాస్ లుక్ లో ఎన్టీఆర్ ను చూపించాలనేది రాజమౌళి ప్రయత్నం.

ఇలా టెంపర్ నుండి ప్రతీ సినిమాకు లుక్ లో ఏదో కొత్తదనం చూపించాలని ఫిక్స్ అయ్యాడు ఎన్టీఆర్..