వచ్చే వారం నుంచి మహర్షి యాడ్-ఆన్ సీన్స్

Monday,May 13,2019 - 04:54 by Z_CLU

మహర్షి సినిమా రన్ టైమ్ చాలా ఎక్కువగా వచ్చింది. చాలా కష్టపడి దాన్ని 2 గంటల 58 నిమిషాలకు కుదించగలిగారు. అలా ఎడిట్ చేసే సమయంలో మహేష్ తో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లికి ఇష్టమైన ఎన్నో సీన్లు కట్ అయ్యాయి. అలా కట్ అయిన స్పెషల్ సీన్స్ ను త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై చూడొచ్చు

అవును.. మహర్షి సినిమా నుంచి ఎడిటింగ్ లో తీసేసిన కొన్ని సన్నివేశాల్ని వచ్చే వారం నుంచి థియేటర్లలో యాడ్ చేయబోతున్నారు. ఇదేదో కలెక్షన్ల కోసం చేస్తున్న పని కాదు. మహేష్ కు ఇష్టమైన సన్నివేశాలవి. అందుకే వాటిని తిరిగి సినిమాకు యాడ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ ఎనౌన్స్ చేశాడు.

సినిమాలో పెళ్లిచూపులు సీన్ అంటే నాకు చాలా ఇష్టం. నిజానికి అది 3 నిమిషాలుంది. రన్ టైమ్ కోసం కుదించారు. అయితే నాకు చాలా ఇష్టమైన 2 నిమిషాల సన్నివేశాల్ని తీసేశారు. వచ్చే వారం నుంచి వాటిని యాడ్ చేయాలనుకుంటున్నాం.

ఈ సీన్స్ తో పాటు క్లయిమాక్స్ లో కూడా మరికొన్ని ఎక్స్ ట్రా సీన్స్ చూడొచ్చంటున్నాడు మహేష్. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది మహర్షి.