రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన పవర్ స్టార్

Monday,May 13,2019 - 02:01 by Z_CLU

పవన్ కల్యాణ్ రీఎంట్రీ..
రామ్ తళ్లూరి నిర్మాత..
డాలీ దర్శకత్వంలో సినిమా..

3 రోజులుగా సోషల్ మీడియాలో నలుగుతున్న రూమర్ ఇది. ఎలక్షన్ రిజల్ట్ తర్వాత పవన్ కల్యాణ్ మరోసారి కెమెరా ముందుకొస్తారని, డాలీ దర్శకత్వంలో రీఎంట్రీ ఇస్తారని గాసిప్స్ ఊపందుకున్నాయి. వీటిపై పవన్ క్లారిటీ ఇచ్చాడు. తన రీఎంట్రీ లేదని స్పష్టంచేశాడు.

గుంటూరులో జనసేన పార్టీ సభ్యులతో రివ్యూ మీటింగ్ పెట్టిన పవన్ కల్యాణ్.. తన రీఎంట్రీ పుకార్లను కొట్టిపారేశాడు. అలాంటి గాసిప్స్ నమ్మొద్దని తన పార్టీ కార్యకర్తలకు చెప్పాడు. పాతికేళ్ల ప్రణాళికతో రాజకీయాల్లోకి వచ్చానని, తనకు సినిమాలు చేసే ఉద్దేశం లేదని తేల్చిచెప్పేశాడు.

పవన్ వద్ద సినిమాలకు సంబంధించి ఇప్పటికీ కొన్ని అడ్వాన్సులు అలానే ఉన్నాయి. వాటిని తన ఎలక్షన్ అఫిడవిట్ లో కూడా చూపించాడు పవన్. ఎన్నికల తర్వాత అతడు మరోసారి సినిమాల్లోకి వచ్చే ఛాన్స్ ఉందంటూ ప్రచారం జరగడానికి మెయిన్ రీజన్ ఇదే.

పవన్ మాత్రం క్లియర్ గా చెప్పేశాడు. ఇకపై ఓన్లీ పాలిటిక్స్.. నో సినిమా.