జీ సినిమాలు ( 14th మే )

Monday,May 13,2019 - 10:01 by Z_CLU

ఒక ఊరిలో
నటీనటులు : తరుణ్రాజాసలోని
ఇతర నటీనటులు : చంద్ర మోహన్నరేష్కల్పనరామరాజుయమునానిరోషా
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ రమేష్ వర్మ
ప్రొడ్యూసర్ : చంటి అడ్డాల
రిలీజ్ డేట్ : 1 జూలై 2005
లవర్ బాయ్ తరుణ్తెలుగమ్మాయి సలోని జంటగా నటించిన లవ్ ఎంటర్ టైనర్ ఒక ఊరిలో. ఒక అందమైన ఊరిలో మొదలైన ప్రేమకథ ఏ మలుపు తిరిగింది. చివరికి ఏమైంది అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మంచి ఫీల్ గుడ్ సినిమా అనిపించుకుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి హైలెట్.

==============================================================================

భగీరథ
నటీనటులు : రవితేజ, శ్రియ
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, నాజర్, విజయ్ కుమార్, బ్రహ్మానందం, జీవ, నాజర్, సునీల్, రఘునాథ రెడ్డి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి
డైరెక్టర్ : రసూల్ ఎల్లోర్
ప్రొడ్యూసర్ :మల్లిడి సత్య నారాయణ రెడ్డి
రిలీజ్ డేట్ : అక్టోబర్ 13, 2005
రవి తేజ, శ్రియ హీరో హీరోయిన్స్ గా రసూల్ ఎల్లోర్ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా భగీరథ’. ఈ సినిమాకు ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా గుర్తింపు అందుకున్న కిషోర్ కుమార్ పార్ధసాని (డాలీ) కథ ను అందించారు. కృష్ణ లంక అనే పల్లెటూరి లో జనాలు పడే ఇబ్బందులను ఓ యువకుడు ఎలా పరిష్కరించాడు అనే కథతో ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా లో రవితేజ నటన, శ్రియ గ్లామర్, పల్లెటూరి సీన్స్, చక్రి పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా రవి తేజ-ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే పోటా పోటీ సీన్స్ అందరినీ అలరిస్తాయి.

==============================================================================

సుబ్రహ్మణ్యపురం

నటీనటులు : సుమంత్, ఈషా రెబ్బ
ఇతర నటీనటులు : సురేష్, తనికెళ్ళ భరణి, సాయి కుమార్, ఆలీ, సురేష్, జోష్ రవి, భద్రం గిరి, మాధవి, హర్షిని, TNR తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర
డైరెక్టర్ : సంతోష్ జాగర్లపూడి
ప్రొడ్యూసర్ : బీరం సుధాకర్ రెడ్డి
రిలీజ్ డేట్ : 7 డిసెంబర్ 2018
నాస్తికుడైన కార్తీక్ (సుమంత్) దేవాలయాలపై పరిశోధనలు చేస్తుంటుంటాడు. ఈ క్రమంలో మహా భక్తురాలైన ప్రియ( ఈషా)ను తొలి చూపులోనే ఆమె మంచితనం చూసి ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యపురం అనే గ్రామంలో ఊహించని రీతిలో వరుసగా ఆత్మహత్యలు జరుగుతుంటాయి. ఆ ఊరికి ప్రెసిడెంట్ అయిన వర్మ(సురేష్) ఊరిలో ఎం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రయత్నించినా అది అంతు చిక్కని సమస్యలా కనిపిస్తుంది. అయితే ప్రియ ద్వారా సుబ్రహ్మణ్యపురం ఊరిలో అడుగుపెట్టిన కార్తీక్ ఆ ఆత్మ హత్యలపై రీ సెర్చ్ మొదలుపెడతాడు. అలా రీ సెర్చ్ మొదలుపెట్టిన కార్తీక్ పది రోజుల్లో సుబ్రహ్మణ్యపురం గుడి వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదిస్తానని ఊరి ప్రజలకు మాటిస్తాడు. ఇంతకీ సుబ్రహ్మణ్యపురం ఏం జరిగిందిచివరికి కార్తీక్ ఆ రహస్యాన్ని ఎలా ఛేదించాడు అనేది మిగతా కథ.

==============================================================================

చిన్నారి
నటీనటులు : ప్రియాంక ఉపేంద్ర, బేబీ యువిన, ఐశ్వర్య షిందోగి, మధుసూధన రావు
మ్యూజిక్ డైరెక్టర్ : B. అజనీత్ లోకనాథ్
డైరెక్టర్ : లోహిత్ M.
ప్రొడ్యూసర్ : K. రవి కుమార్
రిలీజ్ డేట్ : డిసెంబర్ 16, 2016
ప్రియాంక ఉపేంద్ర నటించిన చిన్నారి మూవీ పర్ఫెక్ట్ హారర్ ఎంటర్ టైనర్. చనిపోయిన తన భర్త కోరిక మేరకు గర్భవతి అయిన ప్రియా తన 6 ఏళ్ల కూతురు క్రియ, ఇంకో ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి గోవాలోని తన విల్లాకి వెళుతుంది. అక్కడకు వెళ్లిన కొద్ది రోజుల తరువాత విల్లాలో జరిగే విచిత్రమైన కొన్ని సంఘటనలు వాళ్లకు భయాన్ని కలిగిస్తాయి.
ఆ ఇంట్లో ఉన్న ఏదో అదృశ్య శక్తి ప్రియను, ఆమె కూతురు క్రియను, ఇతర కుటుంబ సభ్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇంతకీ ఆ అదృశ్య శక్తి ఎవరు ? అది ప్రియను, ఆమె కూతురు క్రియను ఎందుకు ఇబ్బంది పెడుతోంది ? ఆ అదృశ్య శక్తి బారి నుండి ప్రియ, క్రియలు తప్పించుకున్నారా లేదా ? అనేదే ఈ సినిమా కథ. హారర్ ఎలిమెంట్స్ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయి.

==============================================================================

యోగి
నటీనటులు ప్రభాస్నయన తార
ఇతర నటీనటులు కోట శ్రీనివాస రావుప్రదీప్ రావత్సుబ్బరాజుఆలీ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : రమణ గోగుల
డైరెక్టర్ : V.V. వినాయక్
ప్రొడ్యూసర్ రవీంద్ర నాథ్ రెడ్డి
రిలీజ్ డేట్ : 12 జనవరి 2017
ప్రభాస్ హీరోగా V.V. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన హై ఎండ్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ యోగి. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఊర్వశి శారద ప్రభాస్ కి తల్లిగా నటించారు. ఈ ఇద్దరి మధ్యన నడిచే ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

ముకుంద

నటీనటులు : వరుణ్ తేజ్పూజ హెగ్డే
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్రావు రమేష్అభిమన్యు సింగ్పరుచూరి వెంకటేశ్వర రావుసత్యదేవ్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్మిక్కీ. జె. మేయర్
డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల
ప్రొడ్యూసర్ఠాగూర్ మధునల్లమలుపు శ్రీనివాస్
రిలీజ్ డేట్ : 24, డిసెంబర్ 2014
మెగా హీరో వరుణ్ తేజ్ సిల్వర్ స్క్రీన్ పై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సూపర్ హిట్ సినిమా ముకుంద. ఒకే ఊళ్ళో రాజకీయ నేపథ్యంలో జరిగే కథతో తెరకెక్కిన ఈ సినిమాలో యూత్ కి , అటు ఫ్యామిలీకి సంబంధించిన ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.