హీరోయిన్ పై క్లారిటీ ఇచ్చిన బోయపాటి

Tuesday,July 07,2020 - 12:48 by Z_CLU

బాలయ్య సినిమాలో హీరోయిన్ ఎవరనే టాపిక్ పై రోజుకో డిస్కషన్ నడుస్తోంది. తాజాగా అమలాపాల్ పేరు కూడా తెరపైకొచ్చింది. అయితే ఈ డిస్కషన్ ను కొట్టి పారేస్తున్నాడు బోయపాటి.

బాలయ్య సినిమా కోసం ఓ కొత్త హీరోయిన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నామని ఇప్పటికే ప్రకటించిన బోయపాటి.. అదే మాటకు కట్టుబడి ఉన్నాడు. బాలయ్య సరసన క్రేజీ హీరోయిన్ కాకుండా, కొత్త హీరోయిన్ కనిపిస్తుందని క్లారిటీ ఇచ్చాడు.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తయింది. ఆమధ్య టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఫ్రెష్ షెడ్యూల్ మొదలైన వెంటనే హీరోయిన్ పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.