హాట్ టాపిక్: మెగాస్టార్ సినిమాలో రౌడీ

Tuesday,July 07,2020 - 01:34 by Z_CLU

మెగాస్టార్ త్వరలోనే మోహన్ లాల్ నటించిన మలయాళ సినిమా ‘లూసిఫర్’ ను తెలుగులో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ షూటింగ్ పూర్తవ్వగానే ఈ రీమేక్ ను సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు చిరు. సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటికొచ్చింది. సినిమాలో విజయ్ దేవరకొండ ఓ స్పెషల్ రోల్ చేయబోతున్నాడనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఒరిజినల్ సినిమాలో పృథ్వీ రాజ్ ఓ స్పెషల్ రోల్ చేశాడు. తెలుగులో ఆ రోల్ ను విజయ్ తో చేయిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారట మేకర్స్. ఇటివలే ఓ మీటింగ్ పెట్టుకొని రౌడీను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారట. ఇదే నిజమైతే చిరంజీవితో నటించాలనే విజయ్ దేవరకొండ కల నెరవేరినట్టే.

సినిమాలో ఇది పవర్ ఫుల్ రోల్. ఈ క్యారెక్టర్ ను ముందుగా ఎవరైనా మెగా హీరోతో చేయించాలని భావించారు మెగాస్టార్. కానీ ఇప్పుడు సడెన్ గా విజయ్ దేవరకొండ పేరు తెరపైకొచ్చింది.