శాతకర్ణి వర్సెస్ ధృవ

Wednesday,October 12,2016 - 11:39 by Z_CLU

నందమూరి నటసింహం, మెగాపవర్ స్టార్ ఒకేరోజు పోటీపడ్డారు. దసరా పర్వదినాన ఒకేసారి తమ కొత్త సినిమాల టీజర్లు విడుదల చేశారు. ముహూర్తం చూసి మరీ బాలకృష్ణ.. తన వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి టీజర్ ను విడుదల చేశారు. శాతకర్ణికి పోటీగా రామ్ చరణ్ కూడా దసరా రోజు సాయంత్రం ధృవ టీజర్ విడుదల చేశారు. ఇలా ఒకేరోజు అటు మెగాభిమానులు, ఇటు నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.

still-2-1-1

ఒకేరోజు, కొన్ని గంటల తేడాలో రెండు భారీ సినిమాల టీజర్లు విడుదల అవ్వడంతో అందర్లో క్యూరియాసిటీ పెరిగింది. ఏ టీజర్ బాగుందనే చర్చ మొదలైంది. నిజానికి ఈ రెండు టీజర్లు వేటికవే విభిన్నం. రెండు టీజర్లను ఒకదానితో ఒకటి పోల్చలేం. ఎందుకంటే.. ఒక సినిమా చరిత్రను బేస్ చేసుకొని వస్తుంటే..ఇంకో మూవీ పక్కా కాంటెంపరరీ కాన్సెప్ట్. అయితే ఈ రెండు సినిమాల్లో ఓ కామన్ ఎలిమెంట్ మాత్రం ఉంది. అదే యాక్షన్. అవును.. ఈ రెండు సినిమాలూ పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్లు.

druva

లుక్స్ పరంగా చూస్తే… గౌతమీపుత్ర శాతకర్ణి ఎలా ఉంటాడో చాలామందికి తెలీదు. శాతకర్ణి ఇలానే ఉంటాడేమో అనేంత గంభీరంగా బాలకృష్ణ లుక్ ఉంది. అటు ధృవ సినిమాలో కూడా చెర్రీ లుక్ అదిరిపోయింది. సిక్స్ ప్యాక్ బాడీ చూపించకపోయినా… ఆ ఛాయలు మాత్రం కనిపించాయి. ఇక విజువల్స్ పరంగా రెండు సినిమాలూ టాలీవుడ్ స్టాండర్డ్స్ ను పెంచే విధంగా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే… అటు శాతకర్ణి, ఇటు ధృవ సినిమాలు రెండూ టీజర్లతో అంచనాల్ని అమాంతం పెంచేశాయి.