నేను లోకల్ - రేపే సిసలైన సెలబ్రేషన్

Thursday,March 23,2017 - 01:11 by Z_CLU

‘నేను లోకల్’ అంటూ యూనివర్సల్ హిట్ ని బ్యాగ్ లో వేసుకున్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 50 డేస్ సెలబ్రేషన్ కు సిద్ధమైంది. రేపటితో ఈ సినిమా 50 రోజులు కంప్లీట్ చేసుకోబోతోంది. నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్.. క్లాస్, మాస్  తేడా లేకుండా అందర్నీ ఇంప్రెస్ చేసింది.

సినిమా రిలీజ్ కి ముందే ఆడియోతో హిట్ అయిన నేను లోకల్… నాని-DSP కాంబోకి లెక్కలేనంత క్రేజ్ తెచ్చిపెట్టింది. సినిమాలోని ప్రతి సన్నివేశంలో న్యాచురల్ గా నటించి 100 కి 100 మార్కులు కొట్టేశాడు నాని. ఈ మూవీతో కీర్తి సురేష్ కూడా తెలుగులో మరో హిట్ అందుకుంది.

ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్స్ లో నేను లోకల్ సినిమా కొనసాగుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు.