హ్యాప్పీ బర్త్ డే శ్రీకాంత్

Thursday,March 23,2017 - 02:06 by Z_CLU

23 మార్చి 1968 న పుట్టిన శ్రీకాంత్ ఈ రోజు తన 49 వ పుట్టిన రోజును సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. పీపుల్స్ ఎన్ కౌంటర్ సినిమాతో తెలుగు స్క్రీన్ కి ఇంట్రడ్యూస్ అయిన శ్రీకాంత్, ఇప్పటికీ డిఫెరెంట్ రోల్స్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.

తెలుగులోను మంచి పర్ఫామెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ తో పాటు అడపాదడపా హీరోగాను అలరిస్తున్న శ్రీకాంత్ ఈ ఏడాది శాండల్ వుడ్ లోను తన లక్ ని చెక్ చేసుకోబోతున్నాడు. కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీకాంత్ ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తుంది.

తెలుగులోనూ బిజీ బిజీగా ఉన్న శ్రీకాంత్ హారర్ ఎంటర్ టైనర్ ‘రా..రా’ సినిమాతో పాటు మరో మాస్ ఎంటర్ టైనర్ ‘నాటుకోడి’ సినిమాలోను నటిస్తున్నాడు. ఇంకా సెట్స్ పైనే ఉన్న ఈ సినిమాలు ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. క్యారెక్టర్ లో దమ్ముండాలి కానీ హీరో క్యారెక్టరా..? స్పెషల్ రోలా..? లాంటి ఆలోచన కూడా లేకుండా పర్ఫెక్ట్ యాక్టర్ అనిపించుకున్న శ్రీకాంత్ కి బర్త్ డే విషెస్ అందిస్తోంది జీ సినిమాలు. హ్యాపీ బర్త్ డే శ్రీకాంత్.