100 మిలియ‌న్ వ్యూస్ దాటిన హిట్ సాంగ్

Tuesday,April 07,2020 - 11:46 by Z_CLU

పాపుల‌ర్ యాంక‌ర్ ప్ర‌దీప్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న‌ ’30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా’ చిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం’ పాట యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. సంగీత ప్రియుల ఆద‌ర‌ణ‌తో 100 మిలియ‌న్ వ్యూస్ క్రాస్ చేసి, ఈ స్థాయి సినిమాల్లో ఇటీవ‌లి కాలంలో ఈ ఫీట్ సాధించిన సినిమాగా స‌రికొత్త చ‌రిత్ర‌ను సాధించింది.

సుకుమార్ ద‌గ్గ‌ర ‘ఆర్య 2’, ‘1.. నేనొక్క‌డినే’ చిత్రాల‌కు ప‌నిచేసిన మున్నా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ఎస్వీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై క‌న్న‌డ చిత్ర‌సీమ‌లో విజ‌య‌వంత‌మైన చిత్రాల నిర్మాత‌గా పేరుపొందిన ఎస్వీ బాబు నిర్మిస్తున్నారు.

అనూప్ రూబెన్స్ సంగీతం స‌మ‌కూర్చ‌గా, ‘నీలి నీలి ఆకాశం’ పాటతో స‌హా చిత్రంలోని అన్ని పాట‌ల‌నూ చంద్రబోస్ రాశారు. ప్ర‌దీప్ మాచిరాజు, అమృతా అయ్య‌ర్‌పై చిత్రీక‌రించిన‌ ‘నీలి నీలి ఆకాశం’ పాట 100 మిలియ‌న్ వ్యూస్ దాట‌డంతో యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది.

సింగ‌ర్స్‌ సిద్ శ్రీ‌రామ్‌, సునీత ఈ పాట పాడారు

’30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా’ సినిమా ఔట్‌పుట్ చూసి న‌చ్చ‌డంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమాని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లతో జీఏ2, యువి క్రియేష‌న్స్ సంస్థ‌లు ఒప్పందం కుదుర్చుకోవ‌డం విశేషం.