బన్నీ బర్త్ డే పోస్టర్ రెడీ

Tuesday,April 07,2020 - 11:35 by Z_CLU

రేపే ‘#AA20’ అఫీషియల్ అప్ డేట్ వస్తోంది
క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో తన 20వ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమాతో మళ్ళీ బన్నీని ఓ డిఫరెంట్ మేకోవర్ లో ప్రెజెంట్ చేస్తున్నాడు సుక్కు.

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి ఫోటో షూట్ చేసి బన్నీ లుక్ ఫైనల్ చేశారు. ఆ లుక్ ను రేపు స్టైలిష్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ గా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. చాలా కేర్ తీసుకొని, టాప్ ఎక్స్ పెర్ట్స్ తో ఈ ఫొటో షూట్ చేశారు.

ఈ సినిమాలో అల్లు అర్జున్ చిత్తూరు యాసలో మాట్లాడుతూ ఎంటర్టైన్ చేయనున్నాడు. నిన్న వదిలిన అప్ డేట్ పోస్టర్ లో ఈ విషయాన్ని క్లారిటీగా చెబుతూ సినిమాపై హైప్ పెంచారు.

ఇక రేపు ఉదయం 9 గంటలకు ఈ సినిమాకు సంబంధించి టైటిల్ లేదా బన్నీ లుక్ వచ్చే ఛాన్స్ ఉంది.

మొన్నటి వరకూ ఈ సినిమాకు ‘శేషాచలం’ అనే టైటిల్ చక్కర్లు కొట్టగా ఇప్పుడు ‘అడవిదొంగ’, పుష్ప అనే అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఈ టైటిల్స్ లో ఏది ఫైనలైజ్ అవుతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అసలు రేపు టైటిల్ రిలీజ్ చేస్తారా లేక బన్నీ లుక్ రిలీజ్ చేస్తారా అనేది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ఈస్ట్ గోదావరిలోని మారేడుమిల్లి అటవీప్రాంతంలో ప్రారంభం అవుతుంది. బన్నీ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరక్టర్. ఇప్పటికే నాలుగు పాటలు రెడీ చేశాడని టాక్.