మార్చి 16న న‌య‌న‌తార‌ "క‌ర్త‌వ్యం" విడుద‌ల‌

Thursday,March 08,2018 - 04:52 by Z_CLU

లేడీ సూపర్ స్టార్ న‌య‌న‌తార‌ ఈమధ్య కాలంలో నటించిన ప్రతి తెలుగు సినిమా సైమల్టేనియస్ గా తెలుగులో కూడా విడుదలవుతోంది. తాజాగా ఆమె నటించిన ఆరమ్ సినిమా కూడా తెలుగులో వస్తోంది. దీనికి కర్తవ్యం అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్బంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజ‌ర్ ని విడుద‌ల చేశారు.

తెలుగులో నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శరత్ మరార్ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. గోపీ నైనర్ ఈ సినిమాను డైరక్ట్ చేయగా… జిబ్రాన్ సంగీతం అందించాడు.

ఇదొక పొలిటికల్ డ్రామా చిత్రం. నయనతార జిల్లా కలెక్టర్ గా న‌టించారు. తెలుగులో ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని మార్చి 16న విడుద‌లకు సిద్ధమైంది.

ఆరుబయట ఆడుకునే పిల్లలు బోరుబావిలో ప‌డిపోతే, అక్కడ జ‌రిగిన ఆప‌రేష‌న్ ను క‌థా వ‌స్తువుగా తీసుకుని రియ‌లిస్టిక్ గా ప్ర‌తి ఒక్క‌రి హృదయానికి హత్తుకునేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ ఆప‌రేష‌న్ ను పర్యవేక్షించిన స్పెష‌ల్ ఆఫీస‌ర్ గా క‌లెక్ట‌ర్ పాత్ర‌లో న‌య‌న‌తార అద్భుతంగా నటించింది. తమిళం లో విడుదలైన ఈ చిత్రం నయనతార కు లేడీ సూప‌ర్‌స్టార్ ఇమేజ్ ని తెచ్చిపెట్టింది.