నయనతార 'కర్తవ్యం'' ట్రయిలర్ రిలీజ్

Tuesday,March 13,2018 - 11:26 by Z_CLU

ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నయనతార మరో మూవీ రెడీ చేసింది. కర్తవ్యం పేరుతో ఇది తెలుగులో విడుదలకు సిద్ధమైంది. వీకెండ్ ఎట్రాక్షన్ గా మార్చి 16న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్ ట్రయిలర్ రిలీజ్ అయింది.

బోరుబావిలో పడిపోయిన ఓ చిన్నారి చుట్టూ తిరిగే కథ ఇది. బావి నుంచి చిన్నారిని బయటకు తీసే ఆపరేషన్ ను లీడ్ చేసే స్పెషల్ ఐఏఎస్ ఆఫీసర్ గా నయనతార ఓ గ్రామానికి వెళ్తుంది. బోరుబావిలో పడిపోయిన చిన్నారితో మొదలైన కథ, ఏ మలుపు తిరిగింది.. ఎన్ని అడ్డంకులు, అవరోధాలు ఎదురైనప్పటికీ కలెక్టర్ గా నయనతార తన కర్తవ్యాన్ని నిర్వర్తించిందా లేదా అనేది ఈ సినిమా స్టోరీ.

కోలీవుడ్ లో విడుదలై సూపర్ హిట్ అయిన ఆరమ్ సినిమాకు రీమేక్ ఇది. తెలుగులో నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శరత్ మరార్ రిలీజ్ చేస్తున్నారు.

ట్రయిలర్ లో ఐఏఎస్ ఆఫీసర్ గా నయనతార యాక్టింగ్… సినిమాటోగ్రాఫర్ ఓంప్రకాష్ వర్క్… జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రయిలర్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.