ఏడాదికి కోటి పెంచేస్తోందట...?

Tuesday,November 22,2016 - 09:53 by Z_CLU

మొన్నటివరకు 2 కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తోందంటే వామ్మో అనుకున్నాం. ఇంకా ఆ షాక్ నుంచి కొందరు సినీజనాలు తేరుకోకముందే మరో కోటి పెంచేసింది నయనతార. అవును.. ప్రస్తుతం సినిమాకు ఆమె 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తోందని టాక్. హీరో, ప్రొడక్షన్ కంపెనీ, దర్శకుడు.. లాంటి అంశాలతో సంబంధం లేకుండా కాల్షీట్లు కావాలంటే 3 కోట్లు ఇవ్వాల్సిందేనట. నయన్ కు కోలీవుడ్ లో పిచ్చ పాపులారిటీ ఉంది. అందుకే ఆమె అడిగినంత ఇవ్వడానికి ప్రొడ్యూసర్లు అస్సలు ఆలోచించడం లేదని లేదని తెలుస్తోంది.

nayantara-2

ఇటీవలే కాష్మోరా సినిమాలో ‘రత్న మహా దేవి’ గా కనిపించి అలరించిన ఈ సీనియర్ ముద్దుగుమ్మ ప్రస్తుతం తమిళ్ లో నాలుగు సినిమాలతో బిజీ గా ఉంది. వీటిలో ఒక్కో సినిమాకు 3 కోట్ల రూపాయల వరకూ అందుకుంటుందని కోలీవుడ్ టాక్. ఇటీవలే తెలుగు లో ఓ బడా సినిమాకు ఈ అమ్మడు ను సంప్రదించగా మూడున్నర కోట్లు డిమాండ్ చేసిందట. అప్పుడే నయన్ పారితోషికం మేటర్ బయటకు వచ్చింది. ఈమధ్య కాలంలో ఇలా ఏడాదికి కోటి రూపాయల చొప్పున పెంచిన హీరోయిన్ మరొకరు లేరు.