లాల్ హల్ చల్

Tuesday,November 22,2016 - 09:27 by Z_CLU

‘జనతా గ్యారేజ్’ సినిమాతో టాలీవుడ్ లో స్ట్రయిట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మోహన్ లాల్ కు  గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఈ చిత్రంతో  తెలుగులో ఓ భారీ హిట్ అందుకోవాలన్న మోహన్ లాల్  కల నెరవేరింది. ఈ సినిమా విజయం సాధించడం,  మోహన్ లాల్ పాత్రకు  మంచి గుర్తింపు రావడంతో, ఒక్కసారిగా మోహన్ లాల్ నటించిన మలయాళ సినిమాలన్నీ టాలీవుడ్ లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి.

mohanlalntr

తాజాగా మోహన్ లాల్ నటించిన మలయాళ చిత్రం ‘పులి మురుగన్’ తెలుగు లో మన్యంపులి పేరుతో విడుదలకు రెడీ అయింది. మ‌ల‌యాలంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా మల్లూవుడ్ లో  రికార్డ్ క్రియేట్ చేసిన ఈ సినిమా, తెలుగులో కూడా తప్పక విజయం సాధిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు కూడా ఓ కీలక పాత్రలో నటించడంతో  సినిమా పై టాలీవుడ్ లో కూడా ఓ మోస్తరు అంచనాలు ఉన్నాయి. తాజాగా ట్రైలర్ ఆవిష్కరణ జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్లలోకి రానుంది.