మరోసారి తండ్రి అయిన అల్లు అర్జున్

Tuesday,November 22,2016 - 10:27 by Z_CLU

వరుస విజయాలతో కెరీర్ ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్… ఇప్పుడు తన ఆనందాన్ని డబుల్ చేసుకున్నాడు. అవును… బన్నీ మరోసారి తండ్రి అయ్యాడు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో స్నేహ-బన్నీ దంపతులకు పండంటి ఆడ బిడ్డ పుట్టింది. తల్లి-బిడ్డ క్షేమంగా ఉన్నారని డాక్టర్లు ప్రకటించారు. ఆడ పిల్ల పుట్టడంతో మెగా కాంపౌండ్ లో సంబరాలు అంబరాన్ని తాకాయి. తనకు పాప పుట్టిన విషయాన్ని బన్నీ స్వయంగా ప్రకటించాడు.

allu-arjun-sneha-reddy-with-son-allu-ayaan
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం సందర్భంగా… బన్నీ మరోసారి తండ్రి కాబోతున్నాడనే వార్త బయటకు వచ్చింది. మెగా కాంపౌండ్ లో మొక్కలు నాటే కార్యక్రమంలో స్నేహా రెడ్డి గర్భవతి అనే విషయం బయటకొచ్చింది. తర్వాత ఆ విషయాన్ని బన్నీ కూడా కన్ ఫర్మ్ చేశాడు. తను మరోసారి తండ్రిని కాబోతున్నానని ప్రకటించాడు. ప్రెగ్నెంట్ స్నేహరెడ్డితో ఉన్న ఫొటోల్ని కూడా రిలీజ్ చేశాడు. ఇప్పుడు స్నేహారెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.