నయనతార 'డోర' రిలీజ్ డేట్

Saturday,March 18,2017 - 06:30 by Z_CLU

నయనతార ప్రధాన పాత్రలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన లేటెస్ట్ సినిమా డోర రిలీజ్ కి రెడీ అవుతుంది. దాస్ దర్శకత్వంలో హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాను సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులో నిర్మిస్తున్నారు.

కారులో దెయ్యం అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే తెలుగు లో ఆడియో విడుదల జరుపుకుంది.. సరి కొత్త కథతో, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో ఆద్యంత ఉత్కంఠ భరితంగా ఉండే ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో మార్చి 31 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్….