జీ సినిమాలు ( మార్చి 19th)

Saturday,March 18,2017 - 11:50 by Z_CLU

నటీనటులు : సలోని, విక్రమ్

ఇతర నటీనటులు : యశ్వంత్, హర్ష, సాయిచంద్, షఫీ, తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : వందేమాతరం శ్రీనివాస్

డైరెక్టర్ : రాజా వన్నెం రెడ్డి

ప్రొడ్యూసర్ : వనపల్లి బాబు రావు

రేపిస్టును చంపడం నేరమా..? అనే కథాంశంతో తెరకెక్కిందే తెలుగమ్మాయి. సలోని తెలుగమ్మాయిగా ఎట్రాక్ట్ చేస్తుంది. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం సినిమాకే హైలెట్.

==============================================================================

హీరోహీరోయిన్లు  – నితిన్, మమతా మోహన్ దాస్

నటీనటులు – సింధు తులాని, అశుతోష్ రానా, శశాంక్, దువ్వాసి మోహన్, బ్రహ్మానందం,అలీ

సంగీతం – చక్రి

బ్యానర్ – ఆర్.ఆర్. మూవీ మేకర్స్

దర్శకత్వం – రవి. సి. కుమార్

విడుదల – 2008, జూన్ 27

ల్యాండ్ మాఫియా నేపథ్యంలో నితిన్ నటించిన సినిమా విక్టరీ. 2008లో నితిన్ మూడు సినిమాలు చేస్తే అందులో ఒకటి విక్టరీ. అశుతోష్ రానా విలన్ గా నటించిన ఈ సినిమాలో మమతా మోహన్ దాస్ ఎప్పీయరెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓ తెలివైన కుర్రాడు తన బలంతో పాటు తెలివితేటలతో ల్యాండ్ మాఫియాను ఎలా అడ్డుకున్నాడనేదే ఈ సినిమా స్టోరీ.

============================================================================

నటీనటులు : శ్రీహరి, రాజా, గజాల, నిఖిత

ఇతర నటీనటులు : బాలాదిత్య, ముకేష్ రిషి, జయప్రకాశ్ రెడ్డి, రంగనాథ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణి శర్మ

డైరెక్టర్ : మల్లికార్జున్

ప్రొడ్యూసర్ : శివకుమార్

రిలీజ్ డేట్ : 6 మార్చి 2008

భద్రాది అనేది అమలాపురం దగ్గర ఒక చిన్న పల్లెటూరు. ఎప్పుడూ పచ్చటి పొలాలతో కళకళలాడుతూ ఉండే భద్రాద్రి ONGC వల్ల వచ్చే గ్యాస్ వల్ల, అక్కడి వాతావరణం కాలుష్యం అయి, దాదాపు స్మశానం లా  తయారవుతుంది. అప్పుడు రఘు రామ్ ( శ్రీ హరి ) ఏం చేశాడు..? తన ఊళ్ళో పరిస్థితులు బాగు చేయడానికి శ్రీహరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు అనేదే ప్రధాన కథాంశం.

============================================================================

నటీనటులు : చిన్నా, మయూరి

ఇతర నటీనటులు : వినోద్ కుమార్, దేవన, కోట శ్రీనివాస రావు

మ్యూజిక్ డైరెక్టర్ : కోటి

డైరెక్టర్ : చిన్న

ప్రొడ్యూసర్ : S. శ్రీనివాస రెడ్డి , రాజు చౌదరి

రిలీజ్ డేట్ : 2009

చిన్నా ప్రధాన పాత్రలో నటించిన ‘ఆ ఇంట్లో’ హారర్ ఎంటర్ టైనర్. తన ఇద్దరు పిల్లలతో కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన హీరో అక్కడ ఏం చూశాడు..? అక్కడి పరిస్థితులను ఎదుర్కోవడానికి తాంత్రికుడిని కలుసుకున్న హీరో ఏం తెలుసుకున్నాడు అనేదే ప్రధాన కథాంశం.

============================================================================

నటీనటులు : శోభన్ బాబు, కృష్ణం రాజు, వాణి శ్రీ

ఇతర నటీనటులు : చంద్ర మోహన్, అంజలీ దేవి, లక్ష్మి, గుమ్మడి వెంకటేశ్వర రావు

మ్యూజిక్ డైరెక్టర్ : జె. వి. రాఘవులు

డైరెక్టర్ : తాతినేని రామారావు

ప్రొడ్యూసర్ : డి. రామానాయుడు

రిలీజ్ డేట్ : 1973

యద్దన పూడి సులోచనా రాణి రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రం జీవన తరగాలు. 1973 లో రిలీజ్ అయి అప్పట్లోనే బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఆ తరవాత ఈ సినిమాని హిందీ, కన్నడ భాషల్లో కూడా రీమేక్ చేశారు. ఈ సినిమాని మూవీ మొఘల్ రామానాయుడు గారు తెరకెక్కించారు.

=============================================================================

నటీనటులు : పృథ్వి సుకుమారన్, మమతా మోహన్ దాస్

ఇతర నటీనటులు : పకాష్ రాజ్, లాల్, అసీం జలాల్, సంపత్ రాజ్, సుధీర్ కర్మణా, సాయి కుమార్, గీత తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : గోపీ సుందర్

డైరెక్టర్ : ఆమాల్ నీరద్

ప్రొడ్యూసర్ : రాజ్ జచారియాజ్

రిలీజ్ డేట్ : 15 అక్టోబర్ 2010

టెర్రరిజం పై ఒక సామాన్యుడు పకడ్బందీ ప్లానింగ్ తో చేసే యుద్ధమే అన్వర్. పృథ్వీ, మమతా మోహన్ దాస్ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్తర్ హిట్ అయింది. గోపీ సుందర్ మ్యూజిక్ తో పాటు, యాక్షన్ సీక్వెసెస్ సినిమాకి హైలెట్.