హీరో నవీన్ పొలిశెట్టి ఇంటర్వ్యూ

Thursday,June 20,2019 - 05:13 by Z_CLU

నవీన్ పొలిశెట్టి హీరోగా స్వరూప్ డైరెక్షన్ లో తెరకెక్కిన `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ‌`. రేపే విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో న‌వీన్ పొలిశెట్టి మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు నవీన్ మాటల్లోనే….

 

అసాధ్యం అనిపించింది

సినిమాల్లోకి రావడానికి చాలా ఇబ్బందులు ఎదురుకోవాల్సి వచ్చింది. అయితే తెలుగులో డైరెక్ట్ గా హీరోగా ఎంటర్ అవ్వడం నాకు ఆ టైంలో అసాధ్యం అనిపించింది. ఆ తర్వాత నేను ముంబైకి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ముంబైలో నాటకాలతో నా కెరీర్ ప్రారంభించాను. అక్కడ నేను చేసిన కొన్ని వీడియోస్ బాగా పాపులర్ అయ్యాయి.

ఎట్రాక్ట్ అయ్యాను.

తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో స్వరూప్ నాకు కాల్ చేసి నీతో సినిమా చేయాలనుకుంటున్నాను అన్నారు. కథేంటి అనగానే డిటెక్టివ్ కథ అన్నారు. అది వినగానే ఎట్రాక్ట్ అయ్యాను. తెలుగులో డిటెక్టివ్ సినిమాలొచ్చి చాలా ఏళ్ళయింది. అదే మాకు ప్లస్ అయ్యింది.

 

సౌండింగ్ బాగుంది …కానీ

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే సౌండింగ్ బాగుంది. కానీ టైటిల్ కామన్ మెన్ కి రీచ్ అవ్వడం కష్టమనిపించింది. షూటింగ్ సమయంలో చాలా మంది టైటిల్ తప్పుగా పలికారు. టైటిల్ రీచ్ అవ్వడానికి టైం పట్టింది. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆడియన్స్ కి బాగా రీచ్ అయింది. సినిమా రిలీజ్ అయ్యాక టైటిల్ ఇంకా రీచ్ అవుతుందని అనుకుంటున్నాం.

 

మర్డర్ మిస్టరీతో….

ఒక్క పెద్ద కేసు కోసం ఎదురుచూస్తున్న డిక్టేటివ్ కి అలాంటి ఛాలెంజింగ్ కేసు వస్తే.. దాన్ని అతను ఎలా హ్యాండిల్ చేశాడు అనేదే సినిమా. సినిమా అంతా ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా బాగుంటాయి.

 

ఆ సినిమాను టచ్ చేయకూడదని ఫిక్సయ్యాం

సినిమా ట్రైలర్ చూసాక చంటబ్బాయి గుర్తొచ్చిందని అంటున్నారు. మేము సెట్స్ పైకి వెళ్ళేటప్పుడు ఆ సినిమాను ఏ రకంగానూ టచ్ చేయకూడదని ఫిక్సయ్యాం. ఎందుకంటే అది ఒక క్లాసిక్ సినిమా. పైగా మా కథ కూడా వేరు. ఫస్ట్ హాఫ్ ఎంటర్తైంగ్ గా ఉన్నప్పటికీ, సెకండ్ హాఫ్ అంతా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆసక్తిగా ఉంటుంది.

 

విజయ్ తో ఫ్రెండ్ షిప్ ఉంది

విజయ్ దేవరకొండ నేను ఒక థియేటర్ ఆర్ట్స్ ప్రోగ్రాం లో కలిసాం. అప్పటి నుండి మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కి ఇద్దరం కలిసే ఆడిషన్స్ కి వెళ్లాం. హీరోల కోసం వెళ్తే వేరే క్యారెక్టర్స్ ఇచ్చారు. కానీ ఆ సినిమాలో చిన్న క్యారెక్టర్స్ అయినప్పటికీ సర్కిల్ పెంచుకోవడానికి మాకు చాలా ఉపయోగపడింది. అందుకే విజయ్ ట్రైలర్ షేర్ చేసి విష్ చేసాడు. తర్వాత కాల్ కూడా చేసి మాట్లాడాడు.

 

ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ 

నాగ్ అశ్విన్ రిలీజ్ చేసిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సుకుమార్ గారు కూడా కాల్ చేసి మాట్లాడారు. చాలా మంది ట్రైలర్ షేర్ చేసి బ్లెస్ చేసారు. వాళ్ళందరికీ సినిమా కచ్చితంగా నచ్చుతుందని భావిస్తున్నాను.

 

మా రిక్వెస్ట్… అదొక్కటే

సినిమా చూసిన వారెవరైనా దయచేసి సినిమాలో ఉన్న ట్విస్టులు రివిల్ చేయకూడదని కోరుకుంటున్నాం. అలా చెప్పేస్తే సినిమాలో ఉన్న కిక్కు పోతుంది. ప్రేక్షకులకు ట్విస్టులు తెలిస్తే ఎంజాయ్ చేయలేరు. అందుకే మీడియా ద్వారా అదొక్కటి రిక్వెస్ట్ చేస్తున్నాను.

 

రెండు కథలున్నాయి.

రెండు కథలు విన్నాను. బాగా నచ్చాయి. దంగల్ ఫేం నితీష్ తివారి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హిందీ సినిమాలో ఓ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాను. ప్రస్తుతానికి అదొక్క సినిమా చేస్తున్నాను. ఈ సినిమా విడుదల తర్వాత మిగతా ప్రాజెక్ట్స్ సెట్ అవుతాయని ఆశిస్తున్నాను.