ప్రియాంక చోప్రాతోనా.. నేనా...?

Sunday,November 27,2016 - 10:25 by Z_CLU

నేచురల్ స్టార్ నాని వరుసగా సినిమాలు సెట్స్ పై పెడుతూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణం లో ‘నేను లోకల్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే శివ అనే నూతన దర్శకుడితో డీవీవీ దానయ్య నిర్మాతగా ఇటీవలే మరో సినిమా కూడా స్టార్ట్ చేశాడు. ఈ రెండు మూవీస్ తో పాటు త్వరలోనే బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా నిర్మాణంలో హీరోగా నటించడానికి నాని రెడీ అవుతున్నాడని వార్తలు వచ్చాయి. వీటిపై నాని క్లారిటీ ఇచ్చాడు. ప్రియాంక చోప్రా ప్రొడక్షన్ లో తను నటించబోతున్నట్టు వస్తున్న వార్తలో నిజం లేదని నాని తేల్చి చెప్పాడు. తను ఏ సినిమా చేస్తున్నా… ఏ సినిమా చేయబోతున్నా… వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తన సోషల్ మీడియా పేజ్ లో ఉంటాయని, ఇలాంటి పుకార్లు నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నాడు నాని.