పవన్ సినిమాలో అనసూయ..?

Sunday,November 27,2016 - 09:47 by Z_CLU

టాలీవుడ్ హాట్ యాంకర్ కం హీరోయిన్ అనసూయ మెగా అఫర్ అందుకుందట. బుల్లితెర పై తన అందాలతో యువతను ఎట్రాక్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వెండితెరపై ఫోకస్ పెడుతూ దూసుకుపోతుంది. ఇప్పటికే ‘సోగ్గాడు చిన్ని నాయనా’, ‘క్షణం’ సినిమాల్లో నటించిన ఈ హాట్ భామ తాజాగా పవన్ సినిమాకు సెలక్ట్ అయినట్టు తెలుస్తోంది.
anasuya
సాయిధరమ్ తేజ్ హీరో గా తెరకెక్కుతున్న ‘విన్నర్’ సినిమాలో ప్రస్తుతం ఐటెం సాంగ్ చేస్తున్న అనసూయ… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా ‘కాటమరాయుడు’ లో కూడా ఐటెం సాంగ్ ఛాన్స్ సొంతం చేసుకుందట.  ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో పవన్ సరసన లక్ష్మీ రాయ్ ఐటెంగర్ల్ గా కనిపించి అలరించగా… ఇప్పుడు కాటమరాయుడు సినిమాలో  అనసూయ పవర్ స్టార్ తో కలిసి చిందేయబోతోందట. ఇప్పటికే ఈ పాట కోసం అదిరిపోయే ట్యూన్ కూడా రెడీ చేశాడు అనూప్.