నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్

Sunday,November 27,2016 - 11:05 by Z_CLU

భారీ క‌లెక్ష‌న్స్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా రెండో వారంలోని అడుగుపెట్టింది, నిఖిల్ నటించిన `ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా` సినిమా. ‘స్వామిరారా’, ‘కార్తికేయ‌’, ‘సూర్య vs సూర్య’ లాంటి వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో హిట్స్ సాధించిన యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడుగా వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సోషియా థ్రిల్ల‌ర్ మూవీ `ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా`. హెబ్బాప‌టేల్‌, నందిత‌శ్వేత‌, అవికాగోర్ హీరోయిన్స్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పి.వెంక‌టేశ్వ‌ర‌రావు నిర్మించారు. న‌వంబ‌ర్ 18న విడుద‌లైన `ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా` సూప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని అమెరికా నుండి అన‌కాప‌ల్లి వ‌ర‌కు నిఖిల్ కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్‌ను సాధించింది.

సినిమా విడుద‌లైన తొలి వారంలోనే 20 కోట్ల రూపాయ‌ల గ్రాస్‌ను క‌లెక్ట్ చేసి నిఖిల్ సినిమాల్లో టాప్ చిత్రంగా నిలిచింది. యు.ఎస్‌లో హాఫ్ మిలియ‌న్ డాల‌ర్స్ క‌లెక్ష‌న్‌ను సాధించిన ఈ చిత్రం స‌క్సెస్‌ఫుల్‌గా రెండో వారంలో అడుగుపెట్ట‌డ‌మే కాకుండా మిలియ‌న్ డాల‌ర్ క‌లెక్ష‌న్స్‌ను సాధించ‌డానికి శ‌ర‌వేగంగా ప‌రుగులు తీస్తుంది.

epc-movie-2

క‌లెక్ష‌న్లు (గ్రాస్)
నైజాం – 5,78, 46,728
సీడెడ్ –  1,40, 71, 126
ఈస్ట్ – 1,21,71,346
వెస్ట్ – 81,93,047
గుంటూర్ – 1,85,62,216
వైజాగ్ – 3,70,03,812
కృష్ణా – 1,05,00,000
క‌ర్ణాట‌క – 80,00,000
ఓవ‌ర్‌సీస్ – 3,64,00,000