సింబా పాత్ర కి డ‌బ్బింగ్ చెప్పిన నేచుర‌ల్ స్టార్ నాని

Sunday,June 30,2019 - 09:30 by Z_CLU

‘ల‌య‌న్ కింగ్’ సినిమలో సింబా పాత్ర‌కి డ‌బ్బింగ్ చెప్పాడు నేచురల్ స్టార్.  ప్ర‌స్తుతం ‘గ్యాంగ్‌లీడ‌ర్’ , ‘వి’  సినిమాలు చేస్తున్న నాని షూటింగ్ కి బ్రేక్ తీసుకొని సింబా పాత్రకు డబ్బింగ్ చెప్పాడు.ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత గాంచిన డిస్ని లాంటి సంస్థ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ల‌య‌న్‌కింగ్ లో సింబా కి నాని డ‌బ్బింగ్ చెప్ప‌టం తెలుగు ప్రేక్ష‌కుల‌కి ల‌య‌న్‌కింగ్ మరింత ద‌గ్గ‌ర‌య్యింది.


‘ల‌య‌న్ కింగ్’ లో సింబానే హీరో ఈ పాత్ర చాలా ముఖ్య‌మైన‌ది. ఈ పాత్ర‌కి హిందిలో షారుక్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ తో డ‌బ్బింగ్ చెప్పించారు. ఇప్ప‌డు తెలుగులో నేచుర‌ల్ స్టార్ నాని డబ్బింగ్ చెబుతున్నారు. అలాగే ముసాఫా పాత్ర కి షారుక్ ఖాన్ చెప్ప‌గా తెలుగు లో జ‌గ‌ప‌తిబాబు చెప్పారు. పుంబా పాత్ర‌కి బ్ర‌హ్మ‌నందం, టీమోన్ పాత్ర‌కి ఆలీ డ‌బ్బింగ్ చెప్పారు. ముఫార్ పాత్ర‌కి పి.ర‌విశంక‌ర్ డబ్బింగ్ చెప్పారు.