సంక్రాంతి కి నాని....

Saturday,January 07,2017 - 09:13 by Z_CLU

ఈ సంక్రాంతి కి నాని తన లేటెస్ట్ సినిమా ‘నేను లోకల్’ తో హంగామా చేయడానికి రెడీ అవుతున్నాడు. ముందుగా ఈ సినిమాను 2016 డిసెంబర్ లో రిలీజ్ చేయాలనుకున్న యూనిట్ 2017 ఫిబ్రవరి కి పోస్ట్ ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. రిలీజ్ కి ఇంకా నెల టైం ఉండడంతో నూతన సంవత్సరం సందర్భంగా ఓ సాంగ్ ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్.

  దేవి శ్రీ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని ‘నెక్స్ట్ ఏంటి?’ అనే సింగల్ ట్రాక్ ను ఈ నెల 6 న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ కూడా చేసేసారు. అయితే ఇంతలో మళ్ళీ ఆ డేట్ ను కాస్త చేంజ్ చేస్తూ జనవరి 12 న ఈ సాంగ్ ను ఓ సప్రయిజ్ తో రిలీజ్ చేయనున్నట్లు లేటెస్ట్ గా అనౌన్స్ చేశారు యూనిట్. అంటే సప్రయిజ్ తో కూడిన ఈ సాంగ్ తో నాని సంక్రాంతి కి సందడి చేయడానికి రెడీ అవుతున్నాడన్న మాట…