రవితేజ రూట్ లో పూరి...

Saturday,January 07,2017 - 10:16 by Z_CLU

ప్రెజెంట్ కొన్ని నెలల నుంచి హాలీడేస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ హీరో ఎవరంటే? టక్కున వినిపించే పేరు రవి తేజ. 2015 లో ‘బెంగాల్ టైగర్’ సినిమా రిలీజ్ తర్వాత మరో సినిమాను సెట్స్ పై పెట్టకుండా దొరికిన ఈ హాలీడే టైంను ఎంజాయ్ చేస్తున్నాడు రవి తేజ.

అయితే ఇప్పుడు స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా రవి తేజ్ నే ఫాలో అవుతున్నాడని పిస్తుంది. టాలీవుడ్ లో జెట్ స్పీడ్ తో సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకెళ్లే పూరి ఒక్క సారిగా స్పీడ్ తగ్గించి రిలాక్స్ అవుతున్నాడు. ఒక పక్క నెక్స్ట్ సినిమాల పై ఫోకస్ పెడుతూనే మరో పక్క ఈ గ్యాప్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడట ఈ స్టార్ డైరెక్టర్. అయితే ఇటీవలే రవి తేజ సినిమా చేసే మూడ్ లో లేడని కొన్నేళ్లుగా మేమిద్దరం రెస్ట్ తీసుకోకుండా సినిమాలు చేసాం అందుకే ప్రెజెంట్ రవి కాస్త గ్యాప్ తీసుకొని ఎంజాయ్ చేస్తున్నాడు నాకు కూడా అదే సలహా ఇచ్చాడు అని చెప్పిన పూరి ఇప్పుడు రవి తేజ నే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది .