రవితేజకి హీరోయిన్స్ ఫిక్స్ ?

Sunday,February 04,2018 - 11:08 by Z_CLU

మాస్ మాహారాజ రవితేజ ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాతో పాటే శ్రీను వైట్ల తో చేయబోయే సినిమా కూడా సెట్స్ పై పెట్టడానికి రెడీ అవ్తున్నాడు రవితేజ. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రవితేజ మూడు విభిన్న క్యారెక్టర్స్ లో కనిపిస్తాడని, ఈ సినిమాలో హీరోయిన్స్ గా కాజల్, నివేత థామస్ ను ఫైనల్ చేసారనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే రవితేజతో ‘సారొచ్చారు’.’వీర’ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై యాక్షన్ & ఫన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాకు ‘అమర్ అక్బర్ అంటోనీ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట మేకర్స్. మార్చ్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే చాన్స్ ఉంది.