జీ సినిమాలు ( 14th ఆగష్టు )

Tuesday,August 13,2019 - 10:02 by Z_CLU

అనగనగ ఒక ధీరుడు

హీరో  హీరోయిన్లు – సిద్దార్థ్, శృతిహాసన్

ఇతర నటీనటులు – లక్ష్మీ మంచు, హర్షిత, సుబ్బరాయశర్మ, రవిబాబు, బ్రహ్మానందం

సంగీతం సలీమ్ సులేమాన్, ఎం.ఎం.కీరవాణి, కోటి, మిక్కీ జే మేయర్, అనంత్

దర్శకత్వం – ప్రకాష్ కోవెలమూడి

విడుదల తేదీ – 2011, జనవరి 14

తెలుగులో ఫాంటసీ-ఎడ్వెంచరస్ మూవీస్ కాస్త తక్కువే. బడ్జెట్ ఎక్కువ, రిస్క్ కూడా ఎక్కువే అనే ఉద్దేశంతో ఎక్కువమంది ఈ జానర్ ను టచ్ చేయరు. కానీ తొలి సినిమాతోనే అలాంటి రిస్క్ తీసుకున్నాడు దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి. అప్పట్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన అనగనగా ఒక ధీరుడు మూవీని డిస్నీ వరల్డ్ సినిమా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సంయుక్తంగా సమర్పించారు. మంచు లక్ష్మి తొలిసారిగా లేడీ విలన్ గా నటించిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఈ మూవీకి ఏకంగా ఐదుగురు సంగీత దర్శకులు పనిచేశారు. యోధ అనే మలయాళ సినిమా ఆధారంగా తెరకెక్కిన అనగనగా ఒక ధీరుడు సినిమాలో భారీ సెట్స్, గ్రాఫిక్స్ కనువిందు చేస్తాయి. 2011 సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా పిల్లల్ని ఎంతగానో ఆకట్టుకుంది. సిద్దార్థ్ నటన, శృతిహాసన్ అందాలు కూడా తోడయ్యాయి. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిపోతున్న శృతిహాసన్ కు తొలి తెలుగు చిత్రం ఇదే.

==============================================================================

బాలు
హీరో హీరోయిన్లు : పవన్ కళ్యాణ్శ్రియ శరన్నేహ ఒబెరాయ్
ఇతర నటీనటులు : గుల్షన్సుమన్జయసుధతనికెళ్ళ భరణిసునీల్బ్రహ్మానందంఎం.ఎస్.నారాయణ తదితరులు
సంగీతం : మణిశర్మ
దర్శకత్వం : కరుణాకరన్
నిర్మాత : అశ్విని దత్
విడుదల తేది : 6 జనవరి 2015
తొలి ప్రేమ తర్వాత పవన్ కళ్యాణ్ -కరుణాకరన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘బాలు‘. వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ ను ఓ కొత్త కోణంలో ఆవిష్కరించింది. అటు చలాకీ కుర్రాడిగా ఎంటర్టైన్ చేస్తూనే మరో వైపు యాక్షన్ ఎపిసోడ్స్ లో అదరగొట్టేసాడు పవర్ స్టార్. మణిశర్మ అందించిన పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్.

==============================================================================

అహ నా పెళ్ళంట
నటీనటులు : అల్లరి నరేష్శ్రీహరిరీతు బర్మేచ
ఇతర నటీనటులు : అనిత హాసనందినిబ్రహ్మానందంఆహుతి ప్రసాద్సుబ్బరాజువిజయ్ సామ్రాట్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె
డైరెక్టర్ : వీరభద్రం
ప్రొడ్యూసర్ : అనిల్ సుంకర
రిలీజ్ డేట్ : 2 మార్చి 2011
రియల్ స్టార్ శ్రీహరినరేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్ టైనర్ అహ నా పెళ్ళంట. వీరభద్రం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని సెంటర్ లలోను సూపర్ హిట్ అయింది. కామెడీ ఈ సినిమాకి పెద్ద ఎసెట్.

==============================================================================

నాగవల్లి
నటీనటులు : వెంకటేష్అనుష్క శెట్టి
ఇతర నటీనటులు : రజినీకాంత్జ్యోతికరిచా గంగోపాధ్యాయశ్రద్దా దాస్కమలినీ ముఖర్జీపూనం కౌర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : గురుకిరణ్
డైరెక్టర్ : P. వాసు
ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్
రిలీజ్ డేట్ : 16 డిసెంబర్ 2010
విక్టరీ వెంకటేష్అనుష్క నటించిన హారర్ కామెడీ ఎంటర్ టైనర్ నాగవల్లి. రజినీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమాకి సీక్వెల్ ఈ సినిమా. అనుష్క నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది.

==============================================================================

పండగ చేస్కో

నటీనటులు : రామ్రకుల్ ప్రీత్ సింగ్

ఇతర నటీనటులు : సాయికుమార్సోనాల్ చౌహాన్బ్రహ్మానందంఆదిత్య మీనన్రావు రమేష్పవిత్ర లోకేష్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్

డైరెక్టర్ గోపీచంద్ మాలినేని

ప్రొడ్యూసర్ రవి కిరీటి

రిలీజ్ డేట్ : 29 మే 2015

రామ్రాకుల్ జంటగా నటించిన పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పండగ చేస్కో. తన కుటుంబ సభ్యుల మధ్య అగాధంలా పేరుకుపోయిన దూరాన్ని హీరో ఎలా తగ్గించాడు..సమస్యని ఎలా సాల్వ్ చేశాడు అన్నదే ప్రధాన కథాంశం. ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

============================================================================

ధీరుడు
నటీనటులు : విశాల్ఐశ్వర్య అర్జున్
ఇతర నటీనటులు : సంతానంజగన్జాన్ విజయ్ఆదిత్య ఓంమురళి శర్మసీత తదితరులు.
మ్యూజిక్ డైరెక్టర్ : తమన్
డైరెక్టర్ భూపతి పాండ్యన్
ప్రొడ్యూసర్ : మైకేల్ రాయప్పన్
రిలీజ్ డేట్ : 26 జూలై 2013
సినిమా సినిమాకి వైవిధ్యం ఉండేలా జాగ్రత్త పడతాడు విశాల్. సీనియర్ నటుడు అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా నటించిన తొలి తమిళ చిత్రం “పట్టాతు యానై” సినిమాకి డబ్బింగ్ వర్షన్ ఈ ధీరుడు. ఈ సినిమా రెండు భాషలలోను ఒకేసారి రిలీజయింది. సంతానం కామెడీ సినిమాకే హైలెట్ గా నిలిచింది.