అప్పుడు హీరోయిన్.. ఇప్పుడు లేడీ విలన్

Tuesday,July 30,2019 - 02:23 by Z_CLU

నమిత.. ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయకపోయినా ప్రేక్షకులకు మాత్రం ఈమె ఇంకా గుర్తుంది. మరీ ముఖ్యంగా సింహా సినిమాలో బాలయ్య సరసన నటించిన నమితను నందమూరి ఫ్యాన్స్ అంత త్వరగా మరిచిపోలేరు. ఇప్పుడీ ముద్దుగుమ్మ మరోసారి బాలయ్య మూవీలో మెరవబోతోంది. కాకపోతే హీరోయిన్ గా కాదు.

అవును.. బాలయ్య కొత్త సినిమాలో లేడీ విలన్ గా కనిపించనుంది నమిత. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాలో నమిత నెగెటివ్ షేడ్స్ లో కనిపించనుంది. ఈ సినిమాలో ఇప్పటికే సోనాల్ చౌహన్, భూమికను హీరోయిన్లుగా తీసుకున్నారు. తాజాగా నమితను సెలక్ట్ చేశారు.

నిజానికి ఈ పాత్ర కోసం ముందుగా వరలక్ష్మి శరత్ కుమార్ ను అనుకున్నారు. ఇలాంటి నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ పోషించడంలో ఆమెకు మంచి అనుభవం ఉంది. అయితే రీసెంట్ గా నమిత కూడా ఈ సెగ్మెంట్ లో రాణిస్తోంది. అందుకే బాలయ్య మరోసారి నమితకు ఛాన్స్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు.