హీరోలు – సైడ్ బిజినెస్

Tuesday,July 30,2019 - 12:02 by Z_CLU

రీసెంట్ గా AMB సినిమాస్ ని సక్సెస్ ఫుల్ గా లాంచ్ చేశాడు మహేష్ బాబు. అంతలోనే ‘హంబుల్ కో’ అంటూ స్టైలింగ్ కి కొత్త డెస్టినేషన్ ని లాంచ్ చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన డీటేల్స్ ని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాడు. జస్ట్ స్టార్ గానే కాదు సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్ కూడా అనిపించుకున్నాడు మహేష్ బాబు. ఇలా ఓ వైపు బిజీగా ఉంటూనే, మరోవైపు సీరియస్ గా బిజినెస్ మెన్ అనిపించుకుంటున్న హీరోలు టాలీవుడ్ లో చాలామంది ఉన్నారు.

  

విజయ్ దేవరకొండ – రీసెంట్ గా ‘రౌడీ క్లబ్’ అంటూ క్లాతింగ్ బ్రాండ్ లాంచ్ చేశాడు విజయ్ దేవరకొండ. టాలీవుడ్ లో కొత్త స్టైల్ ఐకాన్ లా అవతరించిన విజయ్ దేవరకొండ, సక్సెస్ ఫుల్ గా ఈ అప్పరెల్స్ బిజినెస్ లో రాణిస్తున్నాడు.

బన్ని –  అప్పుడెప్పుడో 2016 లోనే బిజినెస్ మెన్ అనిపించుకున్నాడు. ‘800 జూబ్లీ’ పేరుతో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తో పబ్ బిజినెస్ లో ఎంటర్ అయ్యాడు. ఆ తరవాత B-Dubs అనే స్పోర్ట్స్ బార్ లో పార్టనర్ షిప్ కూడా ఉంది.  సిల్వర్ స్క్రీన్ పై స్టైలిష్ స్టార్ అనిపించుకున్న ఈ హీరో,  బిజినెస్ లో కూడా అంతే సక్సెస్ ఫుల్ అనిపించుకుంటున్నాడు.

రామ్ చరణ్ : ట్రూ జెట్ ఎయిర్ లైన్స్ కి ఓనర్… అదొకటేనా నార్మల్ లైఫ్ టు లావిష్ లైఫ్ వరకు దేన్నైనా ఈజీగా లీడ్ చేసే ఈ మెగాహీరో హైదరాబాద్ పోలో, రైడింగ్ క్లబ్ బిజినెస్ లో మెగా స్పీడ్ తో లాభాలు అందుకుంటున్నాడు.

 

రానా దగ్గుబాటి : ముందు బిజినెస్ మెన్ అనిపించుకున్నాకే తరవాత స్టార్ అయ్యాడు రానా. సినిమా రంగంలో 24 క్రాఫ్ట్స్ లోను నాలెడ్జ్ ఉన్న రానా, మరోవైపు ‘CAA KWAN’ ట్యాలెంట్ మ్యానేజ్ మెంట్ కంపెనీలో పార్ట్ నర్ కూడా…

జగపతి బాబు – సిల్వర్ స్క్రీన్ పై  ఇంట్రెస్టింగ్  క్యారెక్టర్స్ తో మెస్మరైజ్ చేసే జగ్గూ భాయ్ కూడా బిజినెస్ మ్యానే. ‘క్లిక్ సినీ ఆర్ట్’ అనే ట్యాలెంట్ మ్యానేజ్ మెంట్ కంపనీని సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నాడు.

 

నాగార్జున – ఇక నాగార్జున గురించి పర్టికులర్ గా చెప్పాల్సిన అవసరం లేదు. నాగ్ ఈ బిజినెస్ చేయలేడు అనే ప్రసక్తే లేదు. N-కన్వెన్షన్  తో పాటు మరెన్నో నాన్ సినిమా రిలేటెడ్ బిజినెస్ ని కూడా అంతే సక్సెస్ ఫుల్ గా లీడ్ చేస్తున్నాడు. వీళ్లతో పాటు సందీప్ కిషన్ లాంటి మీడియం రేంజ్ హీరోలు కూడా నాన్-సినిమా బిజినెస్ లో ఉన్నారు.