లవ్ స్టోరీస్ తో.... బ్యాక్ టు బ్యాక్ !

Sunday,March 24,2019 - 02:20 by Z_CLU

‘ఛలో ‘తో సూపర్ హిట్ కొట్టి స్పీడ్ పెంచిన నాగ శౌర్య ప్రస్తుతం రెండు సినిమాలను ఫైనల్ చేసేసుకున్నాడు. ‘అమ్మమ్మ గారిల్లు’, ‘నర్తన శాల’ సినిమాలు ప్రేక్షకులను నిరుత్సాహ పరచడంతో నెక్స్ట్ సినిమాలపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. తనకి రెండు హిట్స్ అందించిన అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్ లో నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు శౌర్య. ఈ సినిమాకు ‘ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.

ఈ సినిమాతో పాటే సుకుమార్ శిష్యుడు కాశి విశాల్ డైరెక్షన్ లో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ సఫినిష్ చేసుకుంది. ఈ నెలాఖరున ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.

ఈ రెండు సినిమాలకు తనకి కలిసొచ్చిన లవ్ స్టోరీస్ నే ఎంచుకున్నాడు శౌర్య.. ప్రస్తుతం ఈ రెండు సినిమాలను ఒకే టైంలో ఫినిష్ చేసి ఎక్కువ గ్యాప్ లేకుండా థియేటర్స్ లోకి రావాలని చూస్తున్నాడు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ రెండు సినిమాలతో ఈ యంగ్ హీరో ఎలాంటి హిట్స్ సాదిస్తాడో..చూడాలి.