అంతా వరుణ్ తేజ్ వల్లే...!!

Sunday,March 24,2019 - 04:02 by Z_CLU

మార్చి 29 న రిలీజవుతుంది నిహారిక సూర్యకాంతం. ఫస్ట్ లుక్ రిలీజయినప్పటి నుండే సినిమా డిఫెరెంట్ గా ఉండబోతుందనే ఇమేజ్ ని సెట్ క్రియేట్ చేసిన మేకర్స్, ఇప్పుడు అగ్రెసివ్ గా చేస్తున్న ప్రమోషన్స్ లోను అదే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ అటెండ్ అవ్వడంతో సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయింది. ఈ సందర్బంగా సినిమాని ఎంకరేజ్ చేసినందుకు విజయ్ కి థాంక్స్ చెప్పుకున్న నిహారిక పర్టికులర్ గా ‘సూర్యకాంతం’ గురించి మాట్లాడింది.

ఈ సినిమా సెట్స్ పైకి వఛ్చి రిలీజ్ స్టేజ్ వరకు దానికి రీజన్ వరుణ్ తేజ్ అని చెప్పుకుంది నిహారిక. అంతే కాదు ఈ సినిమా కన్నా ముందు నుండే తన ఫ్రెండ్స్, ఫ్యామిలీలో తనకు సూర్యకాంతం అనే ఇమేజ్ ఉంద’ని చెప్పుకుంది. సినిమా డెఫినెట్ గా సక్సెస్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్న నిహారిక సినిమా యూనిట్ ని ఈ సందర్బంగా అభినందించింది.

రాహుల్ విజయ్ సూర్యకాంతం లో హీరోగా నటించాడు. ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మార్క్ K . రాబిన్ మ్యూజిక్ కంపోజర్. సందీప్ ఎర్రం రెడ్డి, సృజన్ యారబోలు, రామ్ నరేష్ కలిసి ఈ సినిమాని నిర్మించారు.