ఆ సినిమా తర్వాతే బంగార్రాజు ?

Sunday,January 27,2019 - 03:29 by Z_CLU

ఇటివలే చిలసౌ సినిమాతో దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ తో నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు నాగార్జున. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసుకున్న మేకర్స్ త్వరలోనే ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా మార్చ్ నుండి సెట్స్ పైకి రానుందని సమాచారం.

ఈ సినిమాను ఫినిష్ చేసిన వెంటనే కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో ‘బంగార్రాజు’ సినిమాను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు నాగ్. ఈ సినిమాలో నాగార్జున తో పాటు నాగ చైతన్య కూడా నటించనున్నాడు.