బాలీవుడ్ రీమేక్ లో నాగార్జున?

Wednesday,October 16,2019 - 02:46 by Z_CLU

మన్మథుడు-2 ఫెయిల్యూర్ తర్వాత డైలమాలో పడ్డాడు నాగార్జున. బంగార్రాజు స్క్రిప్టింగ్ కూడా కొలిక్కిరాకపోవడంతో సెట్స్ కు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే మరీ గ్యాప్ పెరిగిపోతోంది. ఫ్యాన్స్ ఎదురుచూపులు ఎక్కువయ్యాయి. దీంతో ఇప్పుడో రీమేక్ పై ఫోకస్ పెట్టాడు నాగ్. అదే రైడ్ సినిమా.

లాస్ట్ ఇయర్ అజయ్ దేవగన్ నటించిన సూపర్ హిట్ మూవీ ఇది. ఈ సినిమా తెలుగు రీమేక్ లో నాగ్ నటిస్తాడంటూ గతంలోనే గాసిప్స్ వచ్చాయి. ఇప్పుడు మరోసారి ఈ గాసిప్ వైరల్ అవుతోంది. అయితే ఈసారి ఇందులో కూసింత నిజం కూడా ఉంది.

ఏషియన్ మూవీస్ బ్యానర్ ఈ సినిమా రీమేక్ ను స్టార్ట్ చేయబోతోంది. ప్రస్తుతానికి నాగార్జునతో టాక్స్ షురూ చేసింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే నాగ్ ఈ రీమేక్ లో నటిస్తాడు. డైరక్టర్ ఎవరనేది నిర్ణయించేది నాగార్జునే.

రైడ్ లో ఇలియానా హీరోయిన్ గా నటించింది. తెలుగులో కూడా ఆమెనే రిపీట్ చేస్తారేమో చూడాలి. 50 కోట్లు పెట్టి తీసిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 142 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి.