సైరా 2 వారాల వసూళ్లు

Wednesday,October 16,2019 - 03:40 by Z_CLU

చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక సైరా సినిమా నిన్నటితో 2 వారాలు కంప్లీట్ చేసుకుంది. విడుదలైన 13 రోజులకే తెలుగు రాష్ట్రాల్లో వంద కోట్ల షేర్ అందుకున్న ఈ సినిమా, ఇప్పటికీ స్ట్రాంగ్ గా కొనసాగుతోంది. ఈ వీకెండ్ ఈ సినిమాకు మరిన్ని వసూళ్లు వస్తాయని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. తాజా వసూళ్లతో సైరా సినిమా దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్-ఈవెన్ సాధించింది. 14 రోజుల్లో ఈ సినిమాకు 103 కోట్ల 15 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

ఏపీ, నైజాం 14 రోజుల షేర్
నైజాం – రూ. 31.59 కోట్లు
సీడెడ్ – రూ. 18.54 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 15.81 కోట్లు
ఈస్ట్ – రూ. 9.28 కోట్లు
వెస్ట్ – రూ. 6.97 కోట్లు
గుంటూరు – రూ. 9.45 కోట్లు
నెల్లూరు – రూ. 4.42 కోట్లు
కృష్ణా – రూ. 7.29 కోట్లు