మరో కీల‌క పాత్రలో ర‌మ్య‌కృష్ణ‌

Wednesday,October 16,2019 - 01:40 by Z_CLU

ఆకాశ్ పూరి, కేతికా శ‌ర్మ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `రొమాంటిక్‌`. అనిల్ పాదూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ పతాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి నిర్మిస్తున్నారు. `ఇస్మార్ట్ శంక‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత పూరి, ఛార్మి నిర్మిస్తున్న చిత్ర‌మిది.

`బాహుబ‌లి` చిత్రంలో రాజ‌మాత శివ‌గామి న‌టించి సినీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన ర‌మ్య‌కృష్ణ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇందులో ర‌మ్య‌కృష్ణ ఫుల్ లెంగ్త్ రోల్‌లో క‌న‌ప‌డ‌నున్నారు. నిన్నట్నుండి జ‌రుగుతున్న షెడ్యూల్‌లో ర‌మ్య‌కృష్ణ జాయిన్ అయ్యారు.

ఇన్‌టెన్స్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రానికి సునీల్ క‌శ్య‌ప్ సంగీతాన్ని అందిస్తున్నారు. న‌రేశ్ సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది.