టీజర్ తో రెడీ అవుతున్న నాగచైతన్య

Tuesday,July 03,2018 - 01:01 by Z_CLU

చందూ మొండేటి డైరెక్షన్ లో నాగచైతన్య నటిస్తున్న ‘సవ్యసాచి’ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ బయటికొచ్చింది.. ఫస్ట్ లుక్ తో అందరినీ ఇంప్రెస్ చేసిన చైతూ.. టీజర్ తో రెడీ అవుతున్నాడట. జులై 8న ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని త్వరలోనే సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ మెంట్ ఉంటుందని టాక్. ఆల్మోస్ట్ షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమాను ఆగస్ట్ లో రిలీజ్ చేసేందుకు చూస్తున్నారు నిర్మాతలు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చైతూ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మాధవన్, భూమిక కీ రోల్స్ లో కనిపించనున్నారు.

సవ్యసాచి సినిమాకు సంబంధించి కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రం పెండింగ్ ఉంది. అది కంప్లీట్ అయిపోతే టోటల్ షూటింగ్ పూర్తయిపోతుంది. ప్రేమమ్ తర్వాత చందు మొండేటి, చైతూ కాంబినేషన్ లో వస్తున్న సినిమా  ఇది. ఎం.ఎం.కీరవాణి  మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.