అనుపమ ఇంటర్వ్యూ

Tuesday,July 03,2018 - 03:45 by Z_CLU

ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రానుంది తేజ్-ఐ లవ్ యు సినిమా. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో తన క్యారక్టర్, రియల్ లైఫ్ కు దగ్గరగా ఉంటుందని చెబుతోంది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణాలు చెబుతున్న అనుపమ.. సినిమా హైలెట్స్ ను మీడియాతో పంచుకుంది.

నా పేరు నందిని
సినిమా విడుద‌ల కాబోతోంది. నాకు చాలా టెన్ష‌న్‌గా, నెర్వ‌స్‌గా ఉంది. నేను ఇప్ప‌టిదాకా చేసిన సినిమాల్లో శ‌త‌మానం భ‌వ‌తి త‌ప్ప మిగిలిన అన్ని సినిమాల్లోనూ నాది స‌గం క్యారెక్ట‌ర్‌, ఇద్ద‌రు ముగ్గురున్న నాయిక‌ల చిత్రాల్లో న‌టించాను. అయితే ఇప్పుడు `తేజ్ ఐ ల‌వ్ యు`లో చాలా మంచి పాత్ర చేశా. ఇందులో చేసిన పాత్ర పేరు నందిని. నేను ఇంత‌కు ముందు ఎప్పుడూ ఇలాంటి పాత్ర చేయ‌లేదు. అంద‌రినీ మెప్పించే ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది.

బబ్లీ గర్ల్.. యూఎస్ రిటర్న్
సినిమాలో సూప‌ర్ బ‌బ్లీ గ‌ర్ల్ గా న‌టించాను. యుఎస్ నుంచి ఓ ప‌ర్ప‌స్ కోసం హైద‌రాబాద్ వ‌చ్చే అమ్మాయి పాత్ర‌. కొన్నిసార్లు ఇమ్మెచ్యూర్‌గా, కొన్నిసార్లు కేడీగా, కొన్నిసార్లు మెచ్యూర్‌గా.. చాలా వేరియేష‌న్స్ ఉంటాయి. నా రియ‌ల్ లైఫ్ క‌న్నా 10 శాతం ఎక్కువ‌గా ఈ పాత్ర ఉంటుంది. నేను మాట‌కారిని. నందిని పాత్ర కూడా మాట‌కారే.

ఇది కరుణాకరన్ సినిమా
ఈ సినిమా నేను చేయడానికి క‌రుణాక‌ర‌న్ అనే పేరు చాలా పెద్ద రీజ‌న్. నేను ఆయ‌న సినిమాలన్నీ చూశాను. `తొలిప్రేమ‌`,`డార్లింగ్‌`, `ఉల్లాసంగా ఉత్సాహంగా` `హ్యాపీ`.. ఇలా చాలా సినిమాలు చూశా. ప్ర‌తి సినిమాలోనూ ఆయ‌న హీరోయిన్ల‌ను చూపించే విధానం చాలా ఇష్టం. మా ఇంటికి క‌థ చెప్ప‌డానికి వ‌చ్చిన‌ప్పుడు క‌రుణాక‌ర‌న్ ఒక చోట కూర్చోలేదు. లేచి తిరుగుతూ, ప‌రుగులు తీస్తూ… ఆ పాత్ర‌గా మారిపోయి నాకు నెరేష‌న్ ఇచ్చారు. ఆయ‌న ఎగ్జ‌యిట్‌మెంట్ చూసి, నేను ఎగ్జ‌యిట్ అయ్యాను.

తేజూ చాలా కూల్
సాయిధ‌రమ్ తేజ్‌తో ప‌నిచేయ‌డం చాలా హ్యాపీ. సూప‌ర్ కూల్ ప‌ర్స‌న్‌. తేజ్‌కి ద‌ర్శ‌కుడి మీద ఉన్న న‌మ్మ‌కాన్ని చూసి ఆశ్చ‌ర్య‌పోయా. ద‌ర్శ‌కుడికి త‌న‌క‌న్నా ఎక్కువ తెలుసు అనే ఫీలింగ్ తేజ్‌ది. తేజ్ చాలా డౌన్ టు ఎర్త్. నిజాయితీగా ఉంటాడు. త‌న డ్యాన్సుల గురించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు.

ఫస్ట్ టైం డాన్స్ చేశా
నా కెరీర్ లో నేను ఫస్ట్ టైం ఈ సినిమాలో స్టెప్పులు వేశాను. వాటి కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డా. ఫ‌స్ట్ టేక్ లో తేజ్ చేసేసేవారు. నేను మాత్రం రిహార్స‌ల్స్ చేసి చేసేదాన్ని.

మ్యూజిక్ మెల్లగా ఎక్కుతుంది
నాకు గోపీసుంద‌ర్ సంగీతం చాలా ఇష్టం. న‌చ్చుతున్న‌దే అనే మాంటేజ్ సాంగ్ నాకు ఇష్ట‌మైన పాట‌. క‌రుణాక‌ర‌న్ చాలా బాగా విజువ‌లైజ్ చేశారు. తేజ్ పాట‌ల‌ను విన‌గానే న‌చ్చుతాయ‌ని నేను చెప్ప‌ను. కానీ వినేకొద్దీ న‌చ్చుతాయి.

 

పాత్రల్లో లోతు చూస్తా
నాకు ఇంపార్టెంట్ నా క్యారెక్టర్. ఉన్న‌ది ఒక్కటే జింద‌గీలో నా పాత్ర కొంత‌వ‌ర‌కే ఉంటుంది. అలాగే అఆ సినిమాలో నాగ‌వ‌ల్లి అనే పాత్ర కూడా. నా పాత్ర‌ను బ‌ట్టే నేను వాటిని ఎంపిక చేసుకుంటాను. నా పాత్ర‌ల్లో ఇంటెన్సిటీ, జెన్యూనిటీ గురించి ఆలోచిస్తా.

అందుకే మలయాళానికి దూరమయ్యా
మ‌ల‌యాళంలో చేయ‌కూడ‌ద‌ని కాదు. మంచి సినిమాలు అక్క‌డ వ‌చ్చిన‌ప్పుడు నేను తెలుగులో చాలా బిజీగా ఉన్నాను. మ‌ల‌యాళ చిత్రాల చిత్రీక‌ర‌ణ ఇక్క‌డిలాగా విడగొట్టినట్టు ఉండవు. లాంగ్ షెడ్యూల్స్ ఉంటాయి. ఆ స‌మ‌యంలో నేను తెలుగు సినిమాల‌తో బిజీగా ఉన్నాను. కొన్నిసార్లు ఫ్రీగా ఉన్న‌ప్పుడు వ‌చ్చిన స్క్రిప్ట్ లు నాకు న‌చ్చ‌లేదు. సో.. టెక్నికల్ గా కుదరలేదు.

తెలుగు వెంటనే నేర్చుకున్నా
నాకు తెలుగు నేర్చుకోవ‌డానికి కార‌ణం త్రివిక్ర‌మ్‌గారు. `అ ఆ` షూటింగ్ లొకేష‌న్‌కి వెళ్లి నేను కూర్చున్న‌ప్పుడు అంద‌రూ తెలుగులో మాట్లాడుకునేవారు. నేను త్రివిక్ర‌మ్‌గారి ద‌గ్గ‌ర‌కి వెళ్లి, వాళ్లేదో అంటున్నారు. నాకు అర్థం కావ‌డం లేదు. కాస్త ట్రాన్స్ లేట్ చేయండని అడిగా. వెంట‌నే ఆయ‌న స‌రేన‌న్నారు. అవ‌త‌లివాళ్లు ఏది చెప్పినా ఆయ‌న నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ట్రాన్స్ లేట్ చేసేవారు. రెండో సినిమాకు ఎలాగైనా తెలుగు నేర్చుకోవాల‌ని అప్పుడు అనిపించింది. ప్ర‌స్తుతం క‌న్న‌డ సినిమా చేస్తున్నా. అందుకే క‌న్న‌డ నేర్చుకుంటున్నా.

అందుకే డబ్బింగ్ చెప్పలేక
ఈ సినిమాకు నేను డబ్బింగ్ చెప్ప‌లేదు. మిగిలిన సినిమాల‌కు చెప్పాను. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్న‌ప్పుడు నేను `హ‌లో గురూ ప్రేమ‌కోస‌మే` సినిమాతో బిజీగా ఉన్నాను. అందుకే డబ్బింగ్ చెప్పలేకపోయాను. అంతకుమించి వేరే రీజన్ లేదు.