నాగ్-నాని సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్

Tuesday,July 03,2018 - 12:38 by Z_CLU

లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన సూపర్ హిట్ క్లాసిక్ మూవీ దేవదాసు. ఈ టైటిల్ తో సినిమా చేద్దామని నాగార్జున చాలా ట్రై చేశాడు కానీ వర్కవుట్ కాలేదు. ఎట్టకేలకు అతడు నటిస్తున్న ఓ సినిమాకు ఈ టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారు. అవును.. ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్ లో నడుస్తున్న రూమర్ ఏంటంటే.. నాగ్-నాని సినిమాకు దేవదాస్ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారట.

దీని వెనక ఓ చిన్న లాజిక్ కూడా ఉంది. సినిమాలో నాగార్జున క్యారెక్టర్ పేరు దాసు. ఇదొక మాజీ మాఫియా డాన్ క్యారెక్టర్. ఇక నాని క్యారెక్టర్ పేరు దేవ్. ఇదొక యంగ్ అండ్ స్టయిలిష్ డాక్టర్ పాత్ర. సో.. ఈ రెండు పాత్రల పేర్లను కలిపితే అది దేవదాస్ అవుతుంది.

ప్రస్తుతానికైతే ఇది రూమర్ మాత్రమే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 60శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో రష్మిక, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.