Naga Shaurya : సిక్స్ ప్యాక్ కాదు.. ఎయిట్ ప్యాక్

Tuesday,August 11,2020 - 05:58 by Z_CLU

రీసెంట్ గా నాగశౌర్య కొత్త సినిమాకు సంబంధించి ప్రీ-లుక్ రిలీజైంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ఆ సినిమాలో Nagashaurya సిక్స్ ప్యాక్ లుక్ లో మెరిపించాడు.

అయితే ఆ లుక్ లో ఉన్నది సిక్స్ ప్యాక్ కాదంటున్నాడు నాగశౌర్య. అందులో తనది ఎయిట్ ప్యాక్ బాడీ అంటున్నాడు. అంతేకాదు.. త్వరలోనే టెన్ ప్యాక్ బాడీ కూడా సొంతం చేసుకుంటానని కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు ఈ హీరో.

నిజానికి Archery Game బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాకు సిక్స్ ప్యాక్ అవసరం లేదని దర్శకుడు చెప్పాడని, కానీ క్యారెక్టర్ కు పూర్తి న్యాయం చేసేందుకు తను కష్టపడి సిక్స్ ప్యాక్ సాధించానని అంటున్నాడు Nagashaurya.

దాదాపు బయోపిక్ అనిపించేలా రాబోతున్న ఈ సినిమాలో 3 డిఫరెంట్ స్టేజెస్ లో కనిపిస్తాడట శౌర్య. ఆ వేరియేషన్ చూపించాలంటే సిక్స్ ప్యాక్ ఉంటేనే బాగుంటుందని చెబుతున్నాడు.

సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం అవుతుంది. Sri Venkateswara Cinemas LLP, Northstar Entertainment బ్యానర్లపై ఈ సినిమా వస్తుంది.