Tuck Jagadish కు ఎలాంటి డిజార్డర్ లేదు

Tuesday,August 11,2020 - 06:22 by Z_CLU

నాని హీరోగా నటిస్తున్న సినిమా టక్ జగదీశ్. లాక్ డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. మూవీ షూట్ ఆగిపోయినా, దీనిపై గాసిప్స్ మాత్రం ఆగిపోలేదు.

టక్ జగదీశ్ సినిమాలో Nani పాత్రపై 2 రోజులుగా రకరకాల గాసిప్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో నాని bipolar disorder అనే మానసిక వ్యాథితో బాధపడే వ్యక్తిగా కనిపించబోతున్నాడంటూ రూమర్స్ వచ్చాయి.

వీటిపై నాని రియాక్ట్ అయ్యాడు. Tuck Jagadish సినిమాలో తన పాత్రపై వస్తున్న పుకార్లలో నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు.

Shiva Nirvana దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రీతూవర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.