Bangarraju నాగ చైతన్య ఫస్ట్ లుక్ !

Monday,November 22,2021 - 05:56 by Z_CLU

నాగార్జున , నాగ చైతన్య కాంబినేషన్ లో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న సినిమా ‘బంగార్రాజు‘. ‘సోగ్గాడే చిన్ని నాయన’ కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమాలో చైతూ లుక్ ఎలా ఉండబోతుందా అంటూ ఎదురుచూశారు అక్కినేని ఫ్యాన్స్. తాజాగా  సినిమా నుండి చైతు లుక్ రివీల్ చేసి ఫ్యాన్స్ ని ఖుషి చేశారు మేకర్స్. కలర్ ఫుల్ షర్ట్ , జీన్స్ వేసుకొని కళ్ళకి గ్లాసెస్ పెట్టుకొని కర్రని విసురుతూ స్టైలిష్ లుక్ తో చైతూ లుక్ ఆకట్టుకుంది.

రేపు చైతూ పుట్టిన రోజు సందర్భంగా తనకి బర్త్ డే విషెస్ చెప్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అంతే కాదు బర్త్ డే టీజర్ కూడా ప్లాన్ చేశారు. రేపు ఉదయం 10:23 నిమిషాలకు టీజర్ రిలీజ్ చేసి మరోసారి చైతుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపనున్నారు. సినిమాలో చైతు రోల్ ఏంటి ? బంగార్రాజు కి చైతు ఏమవుతాడు ? అనేవి టీజర్ లో చెప్పే అవకాశం ఉంది.  ఇప్పటికే ఈ సినిమా ఆల్బం నుండి రిలీజైన మొదటి సాంగ్ ‘లడ్డుండ’ మిలియన్స్ వ్యూస్ కొల్లగొడుతూ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది. రేపు విడుదలయ్యే టీజర్ కూడా సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను రెట్టింపు చేసేలా ఉండబోతుందని తెలుస్తుంది.

జీ స్టూడియోస్ , అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగార్జున సరసన సత్య భామ పాత్రలో రమ్య కృష్ణ నటిస్తుండగా , నాగ చైతన్య సరసన  నాగ లక్ష్మి పాత్రలో కృతి శెట్టి నటిస్తుంది. అనూప్ రుబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో థియేటర్స్ లోకి రానుంది.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics