F3 - అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ

Tuesday,November 23,2021 - 08:00 by Z_CLU

ఫ్లాప్ అనేది అతని డిక్షనరీలోనే లేదు. చేసింది తక్కువ సినిమాలే కావొచ్చు కానీ వాటి ఇంపాక్ట్ ఎక్కువే. తనదైన ఎంటర్టైన్ మెంట్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే నేటి తరం జంధ్యాల , ఈవీవీ. అతనే అనిల్ రావిపూడి. వరుస బ్లాక్ బస్టర్స్ తో టాప్ డైరెక్టర్ లిస్టులో చేరిపోయిన అనిల్ రావిపూడి తన జన్మదినం సందర్భంగా మీడియాతో మాట్లాడాడు. ఆ విశేషాలు అనిల్ మాటల్లోనే…

అదే స్పెషల్

దర్శకుడిగా ఇది ఆరో పుట్టిన రోజు. ఎక్కిన ప్రతీ స్టెప్ ఒక ఎగ్జైటింగ్ గా ఉంది. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. చాలా నేర్చుకుంటూ ట్రావెల్ చేయాలి. ఈసారి బర్త్ డే స్పెషల్ ఏంటంటే ? F3 షూట్ లో జరుపుకోబోతున్నాను.

బ్యూటిఫుల్ మెడిసిన్

కరోన సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడిప్పుడే అంతా సద్దు మనుగుతుంది. అంతా మెల్లగా సెట్ అవుతుంది. మళ్ళీ మన నార్మల్ లైఫ్ లీడ్ చేయబోతున్నాం. ఈ కోవిడ్ టైంలో మన స్ట్రెస్ నుండి రిలీఫ్ ఇచ్చే బ్యూటిఫుల్ మెడిసిన్ F3. కాన్ఫిడెంట్ గా చెప్పగలను F2 ఎంత బాగా ఎంజాయ్ చేశారో అంతకంటే ఇంచు ఎక్కువే ఎంజాయ్ చేస్తారు.

సంక్రాంతి… కనెక్షన్ కట్ అయింది

సంక్రాంతికి నాకు మంచి కనెక్షన్ ఉంది. నేను డైరెక్ట్ చేసిన ‘F2’ , ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలు సంక్రాంతికి రిలీజయ్యాయి. ఈ సంక్రాంతి కి కూడా వచ్చి ఉంటే సంక్రాంతి సీజన్ లో హ్యాట్రిక్ అయ్యి ఉండేది. కానీ పెద్ద సినిమాల రిలీజ్ లు ఉండటం వలన మేము వెనక్కి తగ్గాల్సి వచ్చింది. పైగా F3 ఈసారి పెద్ద రిలీజ్ ఉండాలని ముందే అనుకున్నాం. సినిమా మీద ఉన్న క్రేజ్ అలాంటిది. అందుకే పెద్ద సినిమాల మధ్యలో కాకుండా పెద్ద రిలీజ్ ఉండేలా ఒక సోలో డేట్ అనుకున్నాం. నిజానికి మాకు కూడా సంక్రాంతి మిస్ అవుతున్నందుకు బాధగానే ఉంది. కానీ మన సినిమా ఎప్పుడొస్తే అప్పుడే పండగ అని సర్దిచెప్పుకున్నాం.

f3 movie

ఈ సారి ఫ్రస్ట్రేషన్ దాని గురించి..

F2లో భార్యల గురించి భర్తల ఫ్రస్ట్రేషన్ చూపించాం. ఇప్పుడు F3 లో మనీ గురించి ఫ్రస్ట్రేషన్ చూపించబోతున్నాం. ఇది కూడా అందరికీ కనెక్ట్ అయ్యే ఎలిమెంట్. డబ్బు కోసం ఎలా ప్రయత్నాలు చేస్తారు ? వాటి వల్ల ఎలా దెబ్బ తింటారనేది చూపిస్తూ ఫన్ , ఫ్రస్ట్రేషన్ రెండూ మనీ చుట్టూనే తిరుగుతుంటాయి. అలాగే ఈసారి ఆ పాత్రలతో పాటు మరికొన్ని క్యారెక్టర్స్ యాడ్ చేశాము. సునీల్ , మురళి శర్మ లాంటి వారితో ఇంకా ఎక్కువ కామెడీ వర్కౌట్ చేసే ప్రయత్నం చేశాను.

అప్పటికి కథేంటో తెలియదు

F2 సినిమా ఎండింగ్ లో F3 అని ఒక లోగో వేసి సీక్వెల్ ఉండబోతుందని చెప్పాం. కానీ అప్పటికి కథేంటో తెలియదు. జస్ట్ చేస్తే బాగుంటుందనుకుని అలా వేశాం. మన టాలీవుడ్ లో కూడా ఎంటర్టైన్ మెంట్ ఫ్రాంచైజీ ఉంటే బాగుంటుంది అనుకున్నాం. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేసే టైంలో ఒక సీరియస్ సినిమా చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ మళ్ళీ మంచి ఎంటర్టైన్ మెంట్ సినిమా చేయాలనుకున్నాను. అప్పుడు F3 చేస్తే బాగుంటుందనుకొని కంప్లీట్ గా వేరే సబ్జెక్ట్ తీసుకొని ఈ కథ రెడీ చేశాము. దీని ఎండింగ్ లో కూడా ఇంకో ఫ్రాంచైజీ రాబోతుందని వేద్దాం అనుకుంటున్నాం(నవ్వుతూ).

ముందు భయపడ్డాం

F3 చేద్దామని డిసైడ్ అవ్వగానే ముందు కొంచెం భయ పడ్డాం. ఆ ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ అవ్వగలమా ? అనిపించింది. కానీ కాన్సెప్ట్ దొరికాక ఇంకా బెటర్ గా చేయగలం అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. అందులో భార్య భర్తల లింక్ ఎలా కుదిరిందో ఇందులో మనీ మీద మంచి లైన్ కుదిరింది.

f3-working-still-zeecinemalu-venkatesh-varun-tej-anil-ravipudi

వెంకటేష్ గారు , వరుణ్ చితకొట్టేసారు

వెంకటేష్ గారు , వరుణ్  ది బెస్ట్ ఇచ్చారు. F2 కి వచ్చిన రెస్పాన్సో, అంత పెద్ద సక్సెస్ అయిందని దాని నుండి వచ్చిన ఎనర్జీనో తెలియదు కానీ చితకొట్టేసారు. కచ్చితంగా మీరు ఊహించి వచ్చిందనికంటే ఇంచు ఎక్కువే నవ్వుకుంటారు. నాదీ గ్యారెంటీ.

ఈసారి బ్రేక్ చేశాను

నా ప్రతీ సినిమాలో ఏదో ఒక మేనరిజం పెడుతుంటాను. అవన్నీ బాగా క్లిక్ అయ్యాయి. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేశాను. ఈసారి F3 లో మేనరిజమ్స్ ఉండవు కానీ యాక్టివిటీస్ ఉంటాయి. ప్రతీ సారి డైలాగ్ అంటే వీడు ఇదే చెప్తుంటాడు అనే ఫీల్ కలుగుతుందని ఈసారి ఇలా కొత్తగా ట్రై చేశాను. ఫ్రాంచైజీ కాబట్టి “అంతేగా అంతేగా” , ‘వెంకీ  హాసన్’ తగులుతుంటాయి. కానీ కొన్ని సిచ్యువేషణ్ లో చేసే యాక్టివిటీస్ హిలేరియస్ గా నవ్విస్తాయి. ఈసారి ఆడియన్స్ అవి ఫాలో అవుతారు.

‘F3’ లో అవన్నీ ఉంటాయి

కథ అనుకున్నప్పుడే అందరికీ కనెక్ట్ అయ్యే కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన ఇంట్లో మన పిల్లలతో ఉండే కొన్ని మూమెంట్స్  సినిమాలో చూపించాం. అవి బాగా వర్కౌట్ అవుతాయని నమ్ముతున్నా. ఎందుకంటే సినిమా చూసినప్పుడు ఫ్యామిలీస్ వాటికి బాగా కనెక్ట్ అవుతూ మన ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుంది కదా అనుకుంటారు.

f3 movie

ఈవీవీ గారు గుర్తొచ్చారు

ఫర్ ది ఫస్ట్ టైం సెట్ లో నాకు ఈవీవీ గారు గుర్తొచ్చారు. కారణం F3 లో చాలా మంది ఆర్టిస్టులు వర్క్ చేశారు. దాదాపు ముప్పై మందికి పైగా ఉన్నారు. ఎటు చూసినా ఆర్టిస్టులే కనిపిస్తుండేవారు. షూట్ లో అంతమందిని హ్యాండిల్ చేయడం అంటే మాటలు కాదు. మొన్న అందరు ఆర్టిస్టులతో పది రోజుల పాటు క్లైమాక్స్ చేశాం. ఆ టైంలో ఈవీవీ గారు ఎలా హ్యాండిల్ చేసేవారో అనుకునే వాడిని.

వెంకటేష్ గారు ఫస్ట్ హాఫ్ చూశారు

రీసెంట్ గా వెంకటేష్ గారు ఫస్ట్ హాఫ్ వరకూ చూశారు. “ఏంటమ్మా ఇది అందరూ ఇరగదీసేసారు” అన్నారు. ఈసారి వెంకటేష్, వరుణ్ లతో పాటు అందరికీ స్కోప్ ఉంది.  సునీల్ , రాజేంద్ర ప్రసాద్ , మురళి శర్మ  ఇలా అందరి క్యారెక్టర్స్ క్లిక్ అవుతాయి.

వెంకటేష్ గారికి , వరుణ్ కి అవి పెట్టా

సినిమాలో వెంకటేష్ గారికి రే చీకటి ఉంటుంది. అలాగే వరుణ్ కి నత్తి పెట్టాను. కాకపోతే అది సినిమా అంతా లేకుండా ఎక్కడా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. మనకి ఎక్కడ అవసరమో అక్కడ ఉంటుంది. కానీ ఆ మూమెంట్ వచ్చినప్పుడల్లా హిలేరియస్ గా ఉంటుంది.

ఆ సాంగ్ లో కనిపిస్తాను

ఈ సారి నా అప్పిరియన్స్ సాంగ్ లో ఉంటుంది. డబ్బు మీద ఒక సాంగ్ రెడీ చేశాం. దేవి మంచి సాంగ్ ఇచ్చాడు. దానికి భాస్కరభట్ల రవి కుమార్ గారు లిరిక్స్ ఇచ్చారు. ఆ సాంగ్ లో చిన్న సాకీలో నేను కనిపిస్తాను. F2 లో కూడా కనిపించాను కాబట్టి మళ్ళీ అదే సెంటిమెంట్ తో (నవ్వుతూ).

దేవి మంచి పాటలిచ్చాడు

F2 కి దేవి  మ్యూజిక్ బాగా హెల్ప్ అయింది. అలాగే ఈ సినిమాకు కూడా బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. రెండు పాటలు అయిపోయాయి. ఇంకా రెండు పాటలు ఇవ్వాల్సి ఉంది. తను ‘పుష్ప’ వర్క్స్ తో బిజీగా ఉన్నాడు. ఆ వర్క్ అవ్వగానే మిగతా రెండు పాటలు చేస్తాడు.

అది సర్ ప్రయిజ్

F3 లో పాన్ ఇండియా కంటెంట్ ఉంటుంది.  అది ఏంటనేది ఇప్పుడే చెప్పలేను. థియేటర్స్ లో సర్ ప్రయిజ్.  రిలీజ్ తర్వాత అందరూ బాగుంది సర్ పాన్ ఇండియా కంటెంట్ అని చెప్తారు. అదేంటనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది.

f3-movie-stills-zeecinemalu1

80 % షూటింగ్ పూర్తి

F3 షూటింగ్ 80 % పూర్తయింది. ఇంకా 20 పర్సెంట్ బ్యాలెన్స్ ఉంది. కొంత టాకీ , రెండు పాటలు షూట్ చేయాల్సి ఉంది. డిసెంబర్ కల్లా టాకీ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. వెంకటేష్ గారు రానాతో కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. దాని డేట్స్ ని బట్టి బ్యాలెన్స్ షూట్ ప్లాన్ చేసుకోవాలి.

ఇక్కడ కంఫర్ట్ గానే ఉన్నా

మిగతా భాషల్లో సినిమాలు చేయాలనే ఆలోచన లేదు.  ప్రస్తుతానికి ఇక్కడ కంఫర్ట్ గానే ఉన్నాను. నా కుర్చీ నాకుంది. నేను లేచి వెళ్తే ఆ ప్లేస్ లో ఎవరో కూర్చుంటారు(నవ్వుతూ). అందుకే ప్రస్తుతానికి నాకు మిగతా భాషల్లో సినిమా చేసే ఆలోచన అస్సలు లేదు.

‘గాలి సంపత్’ … ఒక ప్రయోగం

గాలి సంపత్ రిజల్ట్ విషయంలో నేను ఇబ్బంది పడి నిరాశ పడింది లేదు. ఎందుకంటే నేను రాసుకొని నేను చేసిన సినిమా కాదు. నా ఫ్రెండ్ కోసం ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యాను. అదొక ప్రయోగం అంతే. డిఫరెంట్ గా చేయాలని ట్రై చేశాం వర్కౌట్ అవ్వలేదు.

బాలయ్య గారితో అలా ప్లాన్ చేశా

నెక్స్ట్ బాలకృష్ణ గారితో నేను చేయబోయే సినిమా కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఉండదు. ఆయన స్త్రెంత్ తో డిఫరెంట్ జోనర్ లో చేయబోతున్నాను. ఆ ప్రాజెక్ట్ పై చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను. నేను కంప్లీట్ వేరే యాంగిల్ లో చేయబోతున్న సినిమా అది. జనవరి నుండి ఆ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తాను. జూన్ లేదా జులై నుండి షూటింగ్ అనుకుంటున్నాం. ప్రస్తుతానికి ఆ సినిమా ఒక్కటే కమిటయ్యాను.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics