NC22 వెంకట్ ప్రభు -నాగ చైతన్య మూవీ లాంచ్

Thursday,June 23,2022 - 03:28 by Z_CLU

Naga Chaitanya, Venkat Prabhu’s Bilingual Film Launched Majestically

నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కనున్న తమిళ్ , తెలుగు బైలింగ్వెల్ మూవీ #NC22 సినిమా ఆఫీసులో ప్రారంభమైంది. మొదటి షాట్ కి బోయపాటి శ్రీను క్లాప్ నివ్వగా రానా కెమెరా స్విచ్చాన్ చేశాడు. ప్రముఖ దర్శకుడు భారతీ రాజా స్క్రిప్ట్ అందించారు. నాగ చైతన్య తమిళ్ లో ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాతో దర్శకుడు వెంకట్ ప్రభు తెలుగులో పరిచయం అవుతున్నాడు.

నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఇళయరాజా – యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఫస్ట్ టైం తండ్రి కొడుకులు కలిసి మ్యూజిక్ అందిస్తుండటం విశేషం. శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్స్ బేనర్ పై చిత్తూరి శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అబ్బూరి రవి మాటలు అందిస్తున్నారు. జులై నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమాను ఈ ఏడాది ఎండింగ్ లో థియేటర్స్ లోకి తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నారు.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics